Home /News /crime /

MORE PEOPLES ARE DEAD DUE TO ROAD ACCIDENTS AT KARIMNAGAR VB KNR

Telangana: నిర్లక్ష్యం మాటున ప్రమాదాలు.. నెత్తురోడుతున్న రోడ్లు.. వీధిన పడుతున్న కుటుంబాలు.. ఒక్క సంవత్సరంలోనే..

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడు(ఫైల్)

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడు(ఫైల్)

Karimnagar: ఇంటి నుంచి రోడ్డు మీదికెళ్లాలంటే భయం.. బయటకు వెళ్లినవారు క్షేమంగా తిరిగి ఇంటికి వస్తారన్న నమ్మకం లేదు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకెళ్లాలంటే టెన్షన్..పుణ్యక్షేత్రాలనూ దర్శించుకుని వద్దామనుకుంటే ఏమవుతుందోనన్న భయం. కరీంనగర్ జిల్లాలో ఈ సంవత్సరం జనవరి నుండి ఏప్రిల్ వరకు 41 ప్రమాదాలు జరుగగా 48 మంది మృత్యువత పడ్డారు. 34 మంది క్షత్రగాత్రులు గా మారారు.

ఇంకా చదవండి ...
  ఇంటి నుంచి రోడ్డు మీదికెళ్లాలంటే భయం.. బయటకు వెళ్లినవారు క్షేమంగా తిరిగి ఇంటికి వస్తారన్న నమ్మకం లేదు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకెళ్లాలంటే టెన్షన్..పుణ్యక్షేత్రాలనూ దర్శించుకుని వద్దామనుకుంటే ఏమవుతుందోనన్న భయం. పాఠశాలకు వెళ్లిన పిల్లలు ఇంటికి వచ్చేంతవరకు తల్లిదండ్రులలో ఆందోళన. కొత్తగా వాహనం నడప డం నేర్చుకోవాలంటే హడలే. నల్లని రోడ్డు ఎర్రగా మారుతోంది. ఎదురుగా వస్తున్న వాహనాలు దెయ్యాల్లా కనిపిస్తున్నాయి. వయస్సు తేడా లేకుండా చావు డప్పులు మోగిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో ఈ సంవత్సరం జనవరి నుండి ఏప్రిల్ వరకు 41 ప్రమాదాలు జరుగగా 48 మంది మృత్యువత పడ్డారు. 34 మంది క్షత్రగాత్రులు గా మారారు. రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజల్లో దడపుట్టిస్తున్నారు . ప్రయాణికులను తీసుకెళ్లే బస్సు డ్రైవర్లు మనుషులపైకి దూసుకెళ్తున్నారు.. వందమీటర్ల వేగంతో రయ్‌మంటూ వెళ్లే బైకులను నడిపేవారు ఎదురుగా ఎవరైనా వస్తే వేగం తగ్గించే క్రమంలో నియంత్రణ కోల్పోయి ప్రమాదాల పాలవుతున్నారు.

  సురక్షితమనుకునే కార్లు వేగంగా వెళ్తూ ఉన్నట్టుండి బోల్తా పడుతున్నాయి. వంతెనలపై నుంచి దూసుకెళ్తున్నాయ్‌. వీటి కారణంగా రోజూ పదుల సంఖ్యలో క్షతగాత్రులవుతున్నారు. కొందరు మరణిస్తున్నారు. నిత్యం ఎక్కడోచోట జరుగుతున్న ఘటనలివి. వాహన దారులకు లైసెన్సులు ఇవ్వడం.. రహదారులపై ప్రమాద సూచికలు వేయడానికే పరిమితమైన రవాణా శాఖ.. సక్రమంగా విధులు నిర్వహించని పోలీసుల కారణంగా ప్రమాదాలు పెరుగుతున్నాయి. పోటాపోటీ.. అతివేగం... కరీంనగర్ లో నమోదవుతున్న ప్రమాదాల్లో ఎక్కువ శాతం కార్లు, బైక్ ల ద్వారానే చోటుచేసుకుంటున్నాయి. అతివేగం .. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి . యువకులు ప్రాణాలు కోల్పోతుండడంతో కుటుంబాలకు తీరని దుఃఖం మిగులుతోంది.మొన్నటి కి మొన్న ముగ్గురు యువకులు ఇంటర్ మీడియట్ హాల్ టికెట్స్ తీసుకోని వెళ్లడానికి కరీంనగర్ వచ్చి తిరుగు ప్రయాణం లో నంగునూరు, ప్రతిమ హాస్పిటల్ వద్ద ఆర్టీసీ బస్సు ను ఓవర్ టేక్ చేయడం తో ఎదురుగా వస్తున్న కార్ ను ఢీ కొనడంతో ముగ్గురికి ముగ్గురు అక్కడే మృత్యువాత పడ్డారు. నిన్న కరీంనగర్ కు పని మీద వచ్చి వెళ్తుండగా కొత్తపల్లి మండలం వెదిరె క్రాస్ రోడ్ వద్ద అధిక వేగం తో వెళ్లి లారీ కి యువకుడు ఢీకొనడం తో బైక్ తో పాటు లారీ కింద పడి చనిపోవడం జరిగింది.

  ఇలా జిల్లాలో గత ఐదేళ్లలో 784 రోడ్డు ప్రమాదాలు జరుగగా .. 844 మంది మృతిచెందారు . మరో 372 మంది గాయపడ్డారు . నిబంధనలు పాటించకపోవడం , మద్యం సేవించి వాహనాలు - నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి . ఎక్కు వగా యువత మరణాలు సంభవిస్తుండగా .. నిర్ల క్ష్యంగా వాహనాలు నడపడమే కారణమని పోలీసు లు చెబుతున్నారు . మృతులు , క్షతగాత్రుల్లో ఎక్కువ మంది 17 ఏళ్ల నుంచి 34 ఏళ్ల మధ్య వయస్కులే ఉం టున్నారు . యువత మృతితో వారి కుటుంబ సభ్యు లకు తీరని శోకం మిగులుతోంది . అవగాహన లోపం , నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రాణాలు కోల్పోయి జీవితాంతం కుటుంబ సభ్యులను బాధ ల్లోకి నెడుతున్నారు .

  చేతికందిన కొడుకులు మధ్య - లోనే ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు విల విల్లాడుతున్నారు . లైసెన్స్ లేకున్నా పిల్లలకు తల్లిదం డ్రులు మోటార్‌ సైకిళ్లు కొనిస్తున్నారు . పిల్లలు మారాం చేసి , బెదిరించి వాహనాలు కొనుక్కుని - అతివేగంతో ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు . వాహనాలు వేగంగా నడిపితే చర్యలు తీసుకుంటున్నాం . ప్రత్యేక డ్రైవ్ లు కొనసాగిస్తు న్నాం . మద్యం తాగి వాహనాలు నడపడం , నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుని అధిక మోతాదులో మద్యం తాగిన వారి లైసెన్సులు కూడా రద్దు చేపిస్తున్నాం . లైసెన్స్ లేని పిల్లలకు బైకు , కార్లు ఇవ్వకూడదు . రోడ్డు నియమ నిబంధనల పై ఎప్పటి కప్పుడు అవగాహన కల్పిస్తున్నామని పోలీస్ కమిషనర్ వీబీ.కమలాసన్ రెడ్డి అన్నారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Crime, Crime news, Dead body, Karimnagar, Road Accident, Telangana

  తదుపరి వార్తలు