MORE NUMBER OF ROOT GUNS SIZED IN VISAKHAPATNAM AGENCY VILLAGE K KOTAPADU VZM NGS
Viskahapatnam: విశాఖలో నాటు తుపాకుల కలకలం. లైసెన్స్ లు లేకుండా భారీగా అక్రమ విక్రయాలు. పోలీసుల సోదాల్లో నమ్మలేని విజాలు
విశాఖపట్నంలో నాటు తుపాకుల కలకలం
ఉత్తరాంధ్రలో ఇటీవల గన్ కల్చర్ పెరిగింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎక్కడో ఒక చోట తుపాకీలు పట్టుకుని కనిపిస్తున్న వ్యక్తులు పెరుగుతున్నారు. తాజాగా విశాఖపట్నం జిల్లాలోని కె కోటపాడులో లైసెన్స్ లేకుండా పదుల సంఖ్యలో నాటు తుపాకీలు తయారు చేసి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఒకటి రెండు తుపాకీలు ఒకరి దగ్గర ఉండడం చాలా కష్టం. అది కూడా లైసెన్స్ లేకుండా తుపాకీలను పెట్టుకోవడం పెద్ద క్రైమ్. కానీ విశాఖపట్నంలోని చోడవరం మండలంలోని ఒకే దగ్గర భారీగా నాటు తుపాకీలు లభ్యం అవ్వడం కలకలం రేపింది. కె.కోటపాడు మండలంలోని కె.సంతపాలెంలో లైసెన్సులు లేకుండా అక్రమంగా నాటు తుపాకులను తయారు చేసి అమ్ముతున్న స్థావరాలపై దాడులు చేశారు పోలీసులు.
కె కోటపాడులో ఎప్పటి నుంచో నాటు తుపాకుల బిజినెస్ జరుగుతోందని ఖచ్చితమైన సమాచారం పోలీసులకు అందింది. దీంతో కె.కోటపాడు పోలీస్ స్టేషన్ ఎస్.ఐ.ఎం.నారాయణరావు, సిబ్బందితో కె.సంతపాలెంలో తుపాకులు తయారు చేస్తున్న ర్యాలీ అప్పల నరసయ్య, బల్లంకి సత్యనారాయణ ఇళ్లపై. దాడి చేసి తుపాకులు, తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
అలా తయారు చేసిన తుపాకులను ఒక్కొక్కటీ సుమారు 2 వేలు, 3 వేల రూపాయల వరకు అమ్ముతున్నట్టు గుర్తించారు పోలీసులు. దీంతో ఆ తుపాకులను అమ్ముతున్న వారితో పాటు వాటిని కొనుగోలు చేసిన వారిని కూడా గుర్తించి అరెస్టు చేశారు పోలీసులు. అయితే ఈ తుపాకీల తయారీ, అమ్మకం వ్యవహారంలో రామచంద్రపురానికి చెందిన గొర్లె గురయ్యతో పాటు మరి కొందరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. దీనిపై మరింత లోతైన విచారణ చేసి.. ఇందులో ఎవరు ఉన్నా అందరినీ తప్పక అరెస్ట్ చేస్తామన్నారు.
ఇన్ని తుపాకీలు ఆ వ్యక్తి దగ్గరకు ఎలా వచ్చాయి అన్న అనుమనాలు ఇప్పుడు చోడవరం మండలంలో కలకలం రేపుతోంది. ఇన్ని రోజులూ పోలీసులు ఎందుకు వాటిని గుర్తించలేకపోయారు అనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఇప్పుడే ఇన్ని నాటు తుపాకీలు ఉన్నాయి అంటే. ఇప్పటి వరకు వారు ఎవరెవరికి తుపాకీలు అమ్మారు. అవన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అన్నదానిపై ఫోకస్ పెట్టాల్సి ఉంది. ఇటీవల ఉత్తరాంధ్రలో ఇప్పటికే తుపాకీల కల్చర్ పెరిగిపోయింది. ఇటీవల తుపాకీలు పట్టుకుని ప్రజలను, వ్యాపారులను భయపెట్టే వారి సంఖ్య పెరుగుతోంది.
ఇటీవల విశాఖపట్నంలోని తొమ్మిది మందిని పెళ్లి చేసుకున్ననిత్య పెళ్లికొడుకు ఇంటిలో భారీగా ఆయుధాలు దొరికాయి. విజయనగరం జిల్లాలో ఒక ఆర్మీ జవాను నాటు తుపాకీతో బంగారం వ్యాపారిని బెదిరించాడు. ఇక శ్రీకాకుళం జిల్లాలో ఒడిశా నుంచి వచ్చిన వ్యక్తి డమ్మీ తుపాకీతో టీ స్టాల్ వ్యాపారిని, బస్సులో ప్రయాణికులను బెదరించాడు. వారందరికీ ఈ తుపాకీలు ఎక్కడ నుంచి సరఫరా అవుతున్నాయి. అప్పల నరసయ్య, బల్లంకి సత్యనారాయణల దగ్గర ఎవరెవరికి ఆయుధాలు విక్రయించారు అన్నదానిపై పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.