హోమ్ /వార్తలు /క్రైమ్ /

చీటింగ్ లో ఇది వేరే లెవల్ : ఆస్తులమ్మి భార్యను ఆస్ట్రేలియా పంపాడు..ఉద్యోగం వచ్చాక భర్తకు బిగ్ షాక్ ఇఛ్చింది

చీటింగ్ లో ఇది వేరే లెవల్ : ఆస్తులమ్మి భార్యను ఆస్ట్రేలియా పంపాడు..ఉద్యోగం వచ్చాక భర్తకు బిగ్ షాక్ ఇఛ్చింది

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Woman cheats husband and her mother : పెళ్లి చేసుకుందామని ఎంగేజ్ మెంట్  చేసుకున్నారు. అయితే అమ్మాయి ఆస్ట్రేలియా(Australia)లో సెటిల్ అవ్వాలన్న కోరిక వ్యక్తం చేయడంతో అత్తింటివారు అందుకు అంగీకరించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Woman cheats husband and her mother : పెళ్లి చేసుకుందామని ఎంగేజ్ మెంట్  చేసుకున్నారు. అయితే అమ్మాయి ఆస్ట్రేలియా(Australia)లో సెటిల్ అవ్వాలన్న కోరిక వ్యక్తం చేయడంతో అత్తింటివారు అందుకు అంగీకరించారు. అందుకు అవసరమైన డబ్బులు అన్నీ తామే ఇష్తామని అత్తింటివారు మాట ఇచ్చారు. అయితే అందుకు ఓ కండీషన్ కూడా పెట్టారు. అదేంటంటే అమ్మాయి అక్కడికి వెళ్లి స్థిరపడ్డాక తమ కుమారుడిని జీవిత భాగస్వామి కేటగిరి వీసాతో(Spouse Visa)ఆష్ట్రేలియాకు తీసుకెళ్లాలని. మాట ప్రకారం అత్తింటివాళ్లు అమ్మాయి ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్(Australia Immigration) కు అవసరమైన డబ్బును ఇచ్చారు. ఇప్పుడు ఆ యువతికి ఉద్యోగం వచ్చి బాగా స్థిరపడింది. డబ్బు ఇచ్చిన అత్తింటివారిని,వారికిచ్చిన మాట మరిచిపోయింది. దీంతో అత్తింటివారు ఆ యువతిపై కేసు పెట్టారు.

అసలేం జరిగిందంటే

హర్యానా(Haryana)లోని సిర్సా జిల్లాలోని బుది మారి గ్రామానికి చెందిన సుఖ్ జిత్ కౌర్ కి ఓ కుమారుడు ఉన్నాడు. అతడి పేరు అజ్మీర్. 2018లో సిర్సా జిల్లాలోని దని బాలాసర్ గ్రామానికి చెందిన మహీందర్ సింగ్-జస్వీందర్ దంపతుల కుమార్తె కరన్ దీప్ కౌర్ తో అజ్మీర్ కి నిశ్చితార్థం జరిగింది. అయితే నిశ్చితార్థం సమయంలో కరన్ దీప్ కౌర్ ఆస్ట్రేలియా వెళ్లి సెటిల్ అవడానికి అవసరమైన ఖర్చులన్నీ తామే భరిస్తామని, అయితే అక్కడ ఉద్యోగంలో స్థిరపడ్డాక తమ కుమారుడిని కూడా ఆష్ట్రేలియాకు జీవిత భాగస్వామి కేటగిరీ వీసా కింద తీసుకెళ్లాలన్న కండీషన్ పెట్టారు అజ్మీర్ ఫ్యామిలీ సభ్యులు. దీనికి కరన్ దీప్ అంగీకరించింది. దీంతో జులై1,2018న కరన్ దీప్ ఆస్ట్రేలియా విమానం ఎక్కింది. కరన్ దీప్ ఆస్ట్రేలియాలో స్థిరపడేందుకు రూ.26లక్షలను అజ్మీర్ తల్లిదండ్రులు ఖర్చుపెట్టారు. డబ్బుల కోసం తమ ల్యాండ్ ని అమ్ముకున్నారు. రెండేళ్ల తర్వాత తిరిగి హర్యానా వచ్చింది కరన్ దీప్ కౌర్. రనియాలోని ఓ గురుద్వారాలో అజ్మీర్ ని పెళ్లి చేసుకుంది. వెంటనే ఆస్ట్రేలియా వెళ్లిపోదాం అని కరన్ దీప్ కౌర్ చెప్పిన మాట విని అజ్మీర్ ఉప్పొంగిపోయాడు. పెళ్లి తర్వాత ఈ దంపతులు ఇద్దరు బుధి మారిలో దాదాపు వారం రోజులు గడిపారు. ఆస్ట్రేలియాకు అజ్మీర్ ని తీసుకెళ్లేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు తాను చేస్తున్నట్లు అజ్మీర్,అతని తల్లిదండ్రులను కరన్ దీప్ కౌర్ నమ్మించింది.

China President : బహిరంగ కార్యక్రమంలో కనిపించిన జిన్ పింగ్..అధ్యక్షుడి మార్పు తప్పదా?

మరికొద్దిరోజుల్లో ఆస్ట్రేలియా వెళ్తున్నాం కదా ఒకసారి మా అమ్మానాన్నని కలిసి వస్తా అని కరన్ దీప్ చెప్పడంతో అజ్మీర్ అందుకు అంగీకరించాడు. అలా వెళ్లిన కరన్ దీప్..అజ్మీర్ కి చెప్పకుండానే దేశం దాటి ఆస్ట్రేలియా వెళ్లిపోయింది. అయితే అజ్మీర్ కరన్ కి ఫోన్ చేయగా..ఆమె చెప్పిన సమాధానం విని షాక్ అయ్యాడు. "నేను నీకు ఇకపై ఫోన్ చేయను.నువ్వు కూడా చేయడం మానుకో. డబ్బుల కోసమే మీ అమ్మని,నిన్ను చీట్ చేయాలని మేం ఫ్లాన్ చేశాం. ఇదంతా విదేశాలకు వెళ్లాలనే నా ప్లాన్. ఇప్పుడు నేను విదేశాలలో ఉంటాను, అక్కడికి రాను నాకు మీ అవసరం లేదు" అని చెప్పి భర్త ఫోన్ కట్ చేసింది. కరన్ దీప్ చెప్పిన మాటలు విన్న అజ్మీర్ ఖంగుతిన్నాడు. వెంటనే కరన్ తల్లిదదండ్రులకు ఫోన్ చేయగా వారు కూడా ఇదే సమాధానం చెప్పడంతో అజ్మీర్ కి మైండ్ బ్లాక్ అయింది. కరన్,ఆమెతల్లిదండ్రులపై అజ్మీర్ తల్లి ఎల్లెనాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. పోలీసుల ప్రాథమిక విచారణలో అజ్మీర్ ఫ్యామిలీ చేసిన ఆరోపణలు నిజమేనని పోలీసులు కనుగొన్నారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Australia, Cheating case, Haryana

ఉత్తమ కథలు