రేప్ కేసులో నిందితుడు... పోలీస్‌స్టేషన్ నుంచి పరారీ... ట్రక్కు కింద పడి...

నిందితుడు పారిపోవడంతోనే పోలీసులకు టెన్షన్ మొదలైంది. అతన్ని కావాలనే వదిలేశారని బాధితులు ఆరోపిస్తారేమో అనుకున్నారు. ఆ తర్వాత ఇలా జరిగింది.

news18-telugu
Updated: July 14, 2020, 7:12 AM IST
రేప్ కేసులో నిందితుడు... పోలీస్‌స్టేషన్ నుంచి పరారీ... ట్రక్కు కింద పడి...
రేప్ కేసులో నిందితుడు... పోలీస్‌స్టేషన్ నుంచి పరారీ... ట్రక్కు కింద పడి... (File)
  • Share this:
అది ఒడిశాలోని రాయగడ. అక్కడో ఖాళీ పోలీస్ స్టేషన్ ఉంది. ఏవో చిన్నా చితకా కేసుల్ని పోలీసులు డీల్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఇంతలో... అక్కడకు రెండు లారీల్లో ప్రజలొచ్చారు. "ఆణ్ని దింపండి... దొంగ వెధవ... పనికిమాలినోడు" అంటూ... ఓ పెద్దాయన ఆవేశంతో మండిపడుతుంటే... స్థానికులు... జుట్టు పట్టుకొని ఓ యువకుణ్ని ఓ లారీ నుంచి దింపారు. ఆ యువకుణ్ని లాక్కుంటూ స్టేషన్‌కి తీసుకెళ్తుంటే... వెనకాల వంద మందికి పైగా రావడం చూసిన ఎస్సై... "ఆగండాగండి... ఏమైంది... ఎందుకు ఇంత మంది వస్తున్నారు" అని అడిగాడు. ఓ పెద్ద మనిషి... "సార్... ఈ కొండెగాడు... మా ఊరోడే. పనీ పాటా లేదు. స్థానిక బాలికను రేప్ చేశాడు. ఈడిగి ఉరిశిక్ష ఎయ్యాల" అన్నాడు.

"అర్థమైంది. కానీ కొన్ని ఫార్మాల్టీస్ ఉంటాయి. ఆ బాలిక నుంచి స్టేట్‌మెంట్ తీసుకోవాలి. ఆమెను ఆస్పత్రికి పంపాలి... ఇలా చాలా ఉంటాయి" అని ఎస్సై చెప్తుంటే... "తెలుసు సారూ... అవన్నీ మాకూ తెలుసు. తీసుకొచ్చాం. ఆమెను కూడా తెచ్చాం" అంటూ... బాగా భయపడుతున్న బాలికను ఎస్సై ముందు నిలబెట్టారు. ఎస్సై... ఆ యువకుణ్ని... బాలికను... మరో ఇద్దరు పెద్ద మనుషుల్ని స్టేషన్‌ లోపలికి తీసుకెళ్లి... కంప్లైంట్ రాశారు. తర్వాత బాలికను ఆస్పత్రికి వైద్య పరీక్షల కోసం పంపారు. ఆ ఇద్దరు పెద్ద మనుషుల్ని స్టేషన్‌లో ఉంచి... ఊరి జనాన్ని వెళ్లిపోమని చెప్పారు. సరే అని జనం వెళ్లిపోయారు.

బాలికకు వైద్య పరీక్షలు పూర్తయ్యాక... ఆమెను పెద్ద మనుషులకు అప్పగించి పంపించారు. నిందితుడికి సరైన శిక్ష పడేలా చేస్తామన్నారు. సరే అంటూ పెద్ద మనుషులు బాలికను తీసుకొని వెళ్లిపోయారు. ఆ తర్వాత... పోలీసులకు లైటుగా తలనొప్పి రావడంతో... అందరూ టీలు తెప్పించుకొని... తాగసాగారు. స్టేషన్ దగ్గర జనం ఎవ్వరూ లేకుండా సైలెంట్‌గా ఉంది. రేప్ కేసు నిందితుడు... ఓ మూల కూర్చున్నాడు. "అతన్ని ఏ సెల్‌లో ఉంచుదాం" అనుకుంటుంటే... ఒక్కసారిగా నిందితుడు లేచాడు. సెకండ్లలో మెరుపు వేగంతో పరిగెత్తాడు. టీ టేస్ట్ చూస్తున్న పోలీసులకు... అతను అలా పరిగెడుతుంటే... ఆశ్చర్యం కలిగింది.

"రేయ్... పారిపోకూ" అని ఎస్సై అరుస్తుంటే... వినిపించుకోలేదు. వేగంగా పరిగెడుతుంటే... పోలీసులు ఆలా చూస్తూ షాకులో ఉన్నారు. ఆ పరిగెట్టే కుర్రాడు... వెనక్కి తిరిగి పోలీసుల వైపు చూస్తూ... ముందుకెళ్తుంటే... మలుపు దగ్గర అటు నుంచి ఓ ట్రక్కు వేగంగా వచ్చింది. ట్రక్కు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. కానీ కుర్రాడు చూసుకోకుండా... తిన్నగా వెళ్లి ట్రక్కును ఢీకొని... దాని చక్రాల కింద పడ్డాడు. ఎస్సై చేతిలో టీ గ్లాస్ జారి పడింది. పోలీసులు పరిగెడుతూ వెళ్లి... కుర్రాణ్ని గబగబా పోలీస్ వెహికిల్ ఎక్కించి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్‌మెంట్ చేస్తుండగా... నిందితుడు చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు... దేవుడే శిక్షించాడు అన్నారు. పోలీసులు... దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
Published by: Krishna Kumar N
First published: July 14, 2020, 7:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading