ఐఫోన్ ఆర్డరిస్తే... సబ్బులు వచ్చినందుకు ఫైన్... ఫలించిన రెండేళ్ల పోరాటం

Snapdeal : ఆ ఇంజినీర్‌... స్నాప్‌డీల్ హెల్ప్‌లైన్‌కి కాల్ చేసి... కంపెనీ ప్రతినిధులకు విషయం చెప్పారు. మార్చి 13న కొరియర్ సంస్థకు చెందిన ఇద్దరు ప్రతినిధులు... డెలివరీ ప్యాకెట్‌ను రిటర్న్ తీసుకున్నారు. దర్యాప్తు జరిపించారు. కొరియర్ బాయ్ తప్పేమీ లేదనీ, డెలివరీ సమయంలో... పార్సిల్... ప్యాక్ చేసి ఉందని తేల్చారు.

Krishna Kumar N | news18-telugu
Updated: August 1, 2019, 7:52 AM IST
ఐఫోన్ ఆర్డరిస్తే... సబ్బులు వచ్చినందుకు ఫైన్... ఫలించిన రెండేళ్ల పోరాటం
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: August 1, 2019, 7:52 AM IST
పంజాబ్... మొహాలీలోని... 26 ఏళ్ల సివిల్ ఇంజినీర్‌ పర్వీన్ కుమార్ శర్మకి... ఈ-కామర్స్ వెబ్‌సైట్ స్నాప్ డీల్, ఐఫోన్ డీలర్, కొరియర్ సంస్థ... అందరూ కలిసి... రూ.లక్ష రూపాయలు చెల్లించాలని
మొహాలీ వినియోగదారుల సంఘం ఆదేశించింది. యాపిల్ ఐఫోన్ 7 ప్లస్ కోసం ఆయన మార్చి 4, 2017న స్నాప్ డీల్‌లో ఆర్డర్ ఇ్తచ్చారు. మార్చి 12లోపు ఆర్డర్ డెలివరీ అవుతుందని స్నాప్ డీల్ తెలిపింది. పియోస్ ఫ్యాషన్ సంస్థ ఆ ఫోన్‌ను అమ్మింది. మార్చి 6న బ్లూడార్ట్‌కి చెందిన డెలివరీ బాయ్ పార్శిల్ తెచ్చి ఇచ్చాడు. ఆ పార్శిల్‌ను అతని బదులు కేర్ టేకర్‌గా ఉన్న నేత్ర తీసుకున్నారు. నేత్ర నుంచీ పార్శిల్‌ను తీసుకున్న శర్మ... దాన్ని తెరచి చూశారు. ఆ పార్శిల్‌లో ఐఫోన్‌కి బదులు 5 డిటర్జెంట్ సబ్బులు వచ్చాయి.

శర్మ స్నాప్‌డీల్ హెల్ప్‌లైన్‌కి కాల్ చేసి... కంపెనీ ప్రతినిధులకు విషయం చెప్పారు. మార్చి 13న కొరియర్ సంస్థకు చెందిన ఇద్దరు ప్రతినిధులు... డెలివరీ ప్యాకెట్‌ను రిటర్న్ తీసుకున్నారు. దర్యాప్తు జరిపించారు. కొరియర్ బాయ్ తప్పేమీ లేదనీ, డెలివరీ సమయంలో... పార్సిల్... ప్యాక్ చేసి ఉందని తేల్చారు.

శర్మ రెండుసార్లు ఈమెయిళ్లు పంపినా స్నాప్ డీల్ స్పందించలేదు. పైగా ఆయన అకౌంట్‌ని డిలీట్ చేసింది. దాంతో జూన్ 19, 2017న శర్మ... మొహాలీ కన్సూమర్ ఫోరంకి కంప్లైంట్ ఇచ్చారు. స్నాప్ డీల్ తాము ఐఫోనే పంపినా... కస్టమర్ మాత్రం అబద్ధాలు చెబుతున్నారనీ... డ్రామాలాడుతున్నారని వాదించింది. అసలు ఈ డెలివరీతో తమకు సంబంధం లేదనీ... తాము వస్తువు అమ్మేవారికీ, కొనేవారికీ మధ్యవర్తుల్లా మాత్రమే ఉన్నామని తెలిపింది. పియోస్ ఫ్యాషన్, బ్లూడార్ట్ కొరియర్... దీనిపై స్పందించలేదు. స్నాప్ డీల్ ద్వారానే కొరియర్ సర్వీస్ జరిగినందున స్నాప్ డీల్‌కి దీనితో సంబంధం ఉందని ఫోరం తేల్చింది.



పార్శిల్‌పై మొబైల్ IMEI నంబర్ ఎందుకు వెయ్యలేదని ఫోరం ప్రశ్నించింది. రూల్స్ అతిక్రమంచినందుకు స్నాప్ డీల్, పియోస్ ఫ్యాషన్, బ్లూడార్ట్ కలిసి... రూ.81,799 రిఫండ్‌ను మార్చి 4, 2017 నుంచీ 8 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. అలాగే... పరిహారంగా రూ.10వేలు, కోర్టు ఖర్చులకు రూ.10వేలు చెల్లించాలని ఆర్డర్ వేసింది.
First published: August 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...