ఓ మోడల్‌పై ఆమెకు తెలిసిన వ్యక్తే అత్యాచారానికి పాల్పడ్డాడు. హోటల్‌కు రూమ్‌లో ఈ దారుణానికి ఓడిగట్టాడు. దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. 22 ఏళ్ల బాధితురాలు మోడల్‌గా కొనసాగుతున్నారు. ఢిల్లీలో నివాసం ఉండే ఆమెకు ముంబైకి చెందిన ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడు ఇటీవల తన కుటుంబంతో కలిసి ఢిల్లీకి వచ్చాడు. కుటుంబంతో కలిసి ఢిల్లీలోనే నివాసం ఉంటున్నాడు. ఇదే విషయాన్ని బాధితురాలికి తెలిపాడు. తనను కలవాల్సిందిగా కోరాడు. తన ఫ్రెండ్ చెందిన ఓ ప్లేస్‌లో తనను బాధితురాలిని కోరాడు. అయితే అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఖాన్ మార్కెట్ ప్రాంతంలో కలవాలని కోరాడు. అక్కడ బ్రేక్‌ఫాస్ట్‌కు ప్లాన్ చేసినట్టు చెప్పాడు. అయితే అతని మాయ మాటలు నమ్మిన బాధిత మహిళ.. అతడు చెప్పిన చోటుకు వెళ్లింది. అయితే ఆ తర్వాత ఆ మహిళను ఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలోని ఓ హోటల్ రూమ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను రేప్ చేశాడు.
ఈ ఘటనపై బాధితురాలి పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు తనను రేప్ చేసినట్టు ఫిర్యాదు చేసింది. నిందితుడు తనకు తెలిసిన వ్యక్తేనని పేర్కొంది. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనపై ఓ సీనియర్ పోలీస్ అధికారి PTI వార్త సంస్థతో మాట్లాడారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఫిబ్రవరి 23న నిందితుడిపై కేసు నమోదు చేశామని.. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్టు చెప్పారు. నిందితుడిని పట్టుకోవడానికి ఓ బృందాన్ని ముంబైకి పంపినట్టు తెలిపారు.