హోమ్ /వార్తలు /క్రైమ్ /

‘నేను సంతోషంగా లేను..’.. సూసైడ్ నోట్ రాసి మోడల్ ఆత్మహత్య.. ఎక్కడంటే..

‘నేను సంతోషంగా లేను..’.. సూసైడ్ నోట్ రాసి మోడల్ ఆత్మహత్య.. ఎక్కడంటే..

సూసైడ్ చేసుకున్న మోడల్

సూసైడ్ చేసుకున్న మోడల్

Mumbai: మోడల్ అంధేరి ప్రాంతంలో ఉన్న హోటల్ లో దిగింది. హౌస్ కీపింగ్ సిబ్బంది ఎన్నిసార్లు కాల్ చేసిన ఆన్సర్ చేయలేదు. దీంతో వెంటనే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Maharashtra, India

మహారాష్ట్రలోని ముంబైలో (mumbai)  షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అంధేరీ ప్రాంతంలో ఒక మోడల్ ఆకాంక్ష మోహన్  (modle suicide)  అనే యువతి రాత్రి 8 గంటల ప్రాంతంలో హోటల్ లో దిగింది. ఆమె డిన్నర్ కు ఆర్డర్ పెట్టింది. ఆ తర్వాత.. హౌస్ కీపింగ్ ఎన్నిసార్లు కాల్ చేసిన ఆన్సర్ లేదు. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, మరో కీతో రూమ్ డోర్ ను తెరిచారు. అప్పుడు మోడల్ ఫ్యాన్ కు వేలాడుతూ కన్పించింది.

పక్కన టెబుల్ మీద ఒక సూసైడ్ నోట్ రాసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. దానిలో.. ‘నన్ను క్షమించండి. దీనికి ఎవరూ బాధ్యులు కాదు. నేను సంతోషంగా లేను. నాకు శాంతి కావాలి.." అని ఉంది. వెర్సోవా పోలీసులు ఏడీఆర్ కింద కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.  పోలీసులు విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో ఓ బైకర్(Biker)తన టూవీలర్‌(Two wheeler)ని కారు(Car)గా మార్చేశాడు.

అంటే రెండు టైర్లకు బదులు నాలుగు టైర్లు అమర్చి దానికి క్యాబిన్ ఏర్పాటు చేయలేదు. ఇద్దరు మాత్రమే ప్రయాణించగలిగిన బైక్‌పై తాను కాకుండా మరో ఐదుగురు పిల్లల్ని స్కూల్‌కి తీసుకెళ్తాడు. రోడ్డుపైన ఇంత వెరైటీ దృశ్యం కనిపిస్తే ఎవరు వదిలేస్తారు చెప్పండి అందుకే కారులో వెళ్తున్న ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్‌(Cell phone)తో వీడియో తీసి సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ చేశాడు. అంతే ఇప్పుడు ఆ వీడియోనే తెగ వైరల్(Video viral) అవుతోంది. బైకర్ చేసిన స్టంట్‌ చూసి అందరూ ఎవరికి నచ్చిన విధంగా వాళ్లు కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌ ఝాన్సీలో ఓ బైకర్‌ తన టూవీలర్‌పై ఐదుగురు పిల్లల్ని ఎక్కించుకున్నాడు. అదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి. తాను డ్రైవ్ చేస్తూ తన ముందు పెట్రోల్ ట్యాంక్‌పై ఇద్దర్ని కూర్చొబెట్టుకున్న యువకుడు తన వెనుక మరో ముగ్గుర్ని కూర్చొబెట్టుకున్నాడు. ఝాన్సీలోని బాలాజీ రోడ్డులో ఈవిధంగా ఆరుగురు ఒకే బైక్‌పై వెళ్తుండటం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. సిప్రీ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌కి అత్యంత సమీపంలోనే ఈసంఘటన చోటుచేసుకోవడం విశేషం.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Mumbai

ఉత్తమ కథలు