మోడల్ ఆంచల్ యాదవ్ దారుణ హత్య... చంపేసి, శవానికి రాయి కట్టి నీటిలో పడేశారు...

శవానికి రాయి కట్టి, చెరువులో పడేసిన దుండుగులు... శరీరం మీద టాటూ ఆధారంగా మోడల్ ఆంచల్‌గా గుర్తించిన తల్లిదండ్రులు... ఐదేళ్ల క్రితం బ్లాక్‌మెయిలింగ్ ఆరోపణల కింద అరెస్ట్ అయిన ఆంచల్ యాదవ్

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 29, 2019, 8:53 PM IST
మోడల్ ఆంచల్ యాదవ్ దారుణ హత్య... చంపేసి, శవానికి రాయి కట్టి నీటిలో పడేశారు...
మోడల్ ఆంచల్ యాదవ్ దారుణ హత్య...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: March 29, 2019, 8:53 PM IST
జార్ఖండ్ రాష్ట్రంలో ప్రముఖ మోడల్‌గా గుర్తింపు పొందిన ఆంచల్ యాదవ్ దారుణ హత్యకు గురైంది. ఆమెపై కత్తులతో దాడి చేసి, కిరాతకంగా చంపిన దుండగులు... శవం కనిపించకుండా ఉండేందుకు రాయి కట్టి, నీటిలో పడేశారు. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన జార్ఖండ్‌లోని ధంతేరి జిల్లాలో వెలుగుచూసింది. జార్ఖండ్‌లోని రాంచీలో ఉంటూ మోడల్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది 32 ఏళ్ల ఆంచల్ యాదవ్. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉండే ఆంచల్‌కు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ధంతేరి జిల్లాలోని బాలోద్ గ్రామంలోని ఓ చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం బయటికి వచ్చింది. ముఖం గుర్తు తెలియనంతగా పాడైపోవడంతో శరీరం మీద ఉన్న టాటూను ఫోటో తీసి... సోషల్ మీడియాలో ప్రచారం చేశారు పోలీసులు. ఆ టాటూను గుర్తుపట్టిన ఆంచల్ యాదవ్ స్నేహితులు, ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్పారు.

వారు మార్చురీలో ఉన్న మహిళ మృతదేహాన్ని చూసి, తమ కూతురేనని గుర్తించారు. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి... ఆంచల్ యాదవ్‌ను బైక్‌పైన ఎక్కించుకుని తీసుకెళ్లాడని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. చిన్నపని ఉందని, ఇప్పుడే వస్తానని చెప్పిన ఆంచల్... ఇప్పుడు ఇలా కనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంచల్ యాదవ్ శవంపై కత్తిపోట్లు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. హత్య మాత్రమేనా అత్యాచారం చేసి చంపేశారా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఆంచల్‌ యాదవ్‌కు బాగా సాన్నిహిత్యం ఉన్న వ్యక్తే, ఆమెను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంచల్ యాదవ్ సోషల్ మీడియా అకౌంట్స్, కాల్ డేటా ద్వారా దర్యాప్తు చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం ఓ శృంగార వీడియో ద్వారా ఫారెస్ట్ ఆఫీసర్‌ను బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్న ఆరోపణల కింద ఆంచల్ యాదవ్ అరెస్ట్ అయ్యింది. ఇన్స్యూరెన్స్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్న సమయంలో ఫారెస్ట్ ఆఫీసర్‌ను కలిసానని, అప్పుడు పాలసీ తీసుకోవాలంటే తనతో సెక్స్ చేయాలని అధికారి తనపై లైంగికదాడి చేశాడని సంచలన ఆరోపణలు చేసింది ఆంచల్ యాదవ్. ఈ వివాదం ఇంకా కోర్టులో నడుస్తున్న సమయంలో ఆమె హత్యకు గురైంది.

First published: March 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...