దిశ నిందితుల ఎన్‌కౌంటర్ స్థలంలో టిఫిన్ సెంటర్

ఈ రద్దీని ఆసరాగా చేసుకొని సందట్లో సడేమియా అన్నట్లు కొందరు అక్కడ ఒక మొబైల్ టిఫిన్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు.

news18-telugu
Updated: December 8, 2019, 3:50 PM IST
దిశ నిందితుల ఎన్‌కౌంటర్ స్థలంలో టిఫిన్ సెంటర్
దిశ నిందితుల ఎన్‌కౌంటర్ స్థలంలో టిఫిన్ సెంటర్
  • Share this:
దిశ నిందితుల ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతానికి జనం తండోపతండాలుగా మారాయి. నిన్నమొన్నటివరకు నిర్మానుష్యంగా మారిన ఈ ప్రాంతో ఇప్పుడు సందడిగా మారింది. చాలామంది నిందితుల్ని ఎక్కడ ఎన్‌కౌంటర్ చేశారని తెలుసుకోవడానికి వస్తుంటే... మరికంందరు అటువైపుగా వెళ్లిన వారంతా... అక్కడ ఆగి మరి ఫోటోలు, వీడియో తీస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలో గల చటాన్ పల్లి గ్రామ శివారులో గత నెల 27వ తేదీన దిశను రేప్ చేసి హత్య చేశారు. దీంతో ఆ తర్వాత నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు శుక్రవారం ఉదయం చటాన్‌పల్లి గ్రామ శివారుల్లో దిశను ఎక్కడైతే సజీవదహనం చేశారో ఆ ప్రాంతానికి కొంచెం దూరంలో నలుగురు నిందితుల్ని ఎన్‌కౌంటర్ చేశారు.

అయితే ఇప్పుడు ఈ నలుగురిన జరిగిన ఎంకౌంటర్ ప్రాంతాన్ని చూడడానికి జనం తండోపతండాలుగా వస్తున్నారు. హైవే కావడంతో ఒకరిని చూసి ఒకరు తమ వాహనాలను నిలిపి దిశ హత్య జరిగిన స్థలాన్ని మరియు అదేవిధంగా ఎన్ కౌంటర్ జరిగిన ఈ ప్రాంతంలో తమ సెల్ఫోన్లలో వీడియోలు ఫోటోలు తీస్తూ సందడి చేస్తున్నారు. ఎవరి గోల వారు చేస్తుంటే నేషనల్ హైవే జాతీయ రహదారి కావడంతో పోలీసులకు ట్రాఫిక్ నియంత్రణ పెద్ద సవాల్ గా మారింది ఈ రద్దీని ఆసరాగా చేసుకొని సందట్లో సడేమియా అన్నట్లు కొందరు అక్కడ ఒక మొబైల్ టిఫిన్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు.

First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>