ఇస్మార్ట్ శంకర్ డైలాగ్స్‌తో అనంత బస్టాప్‌లో సైకో వీరంగం...

Anantapur Psycho : అసలే బస్సులు రష్‌గా ఉన్నాయనీ ప్రయాణికులు తమ సమస్యల్లో తాము ఉంటే... మధ్యలో ఈ సైకో హడావుడి ఎక్కువైపోయింది. అసలేం జరిగిందో తెలిస్తే ఆశ్చర్యమే.

Krishna Kumar N | news18-telugu
Updated: October 1, 2019, 2:38 PM IST
ఇస్మార్ట్ శంకర్ డైలాగ్స్‌తో అనంత బస్టాప్‌లో సైకో వీరంగం...
అనంత బస్టాప్‌లో సైకో వీరంగం...
  • Share this:
Anantapur Psycho : అది అనంతపురం జిల్లాలోని... ఆర్టీసీ బస్టాండ్. ఓ కుర్రాడు పనీ పాటా లేకుండా అటూ ఇటూ తిరుగుతున్నాడు. కొందరు ప్రయాణికులకు ఇతనెవరూ... ఎందుకిలా తిరుగుతున్నాడు అని డౌట్ వచ్చింది. ఇంతలో ఆ కుర్రాడు... ఓ ప్రయాణికుడి దగ్గర సెల్‌ఫోన్ లాక్కొని పారిపోయేందుకు యత్నించాడు. అప్పటికే అతనిపై చాలా మందికి డౌట్ వచ్చిందిగా... వాళ్లంతా అలర్టై... రేయ్... ఎవడ్రా నువ్వు అని నాలుగు బాది... మొబైల్ లాక్కొని... పోలీసులకు అప్పగించారు. పోలీసులు బస్టాండ్‌లోని అవుట్ పోస్ట్‌కి తీసుకెళ్లారు. అక్కడ జరిగిన ఎంక్వైరీలో తేలిందేంటంటే... అతని పేరు నాని అని తెలిసింది. పీఎస్‌కి వెళ్లాక... అతను అపరిచితుడిలా తయారయ్యాడు. నన్ను పట్టుకుంటారా అంటూ... ఇస్మార్ట్ శంకర్ సినిమాలో డైలాగ్స్ చెబుతూ... అక్కడి ఫర్నిచర్ ధ్వంసం చేసి, అద్దాల్ని పగలగొట్టాడు. పోలీసుల్ని తిడుతూ... గాజు ముక్కలతో తనకు తాను గాయాలు చేసుకున్నాడు. అక్కడితో అయిపోలేదు. పోలీసులపైనా దాడి చెయ్యబోయాడు. అప్పటికే వీడో సైకోలా ఉన్నాడే అనుకున్నపోలీసులు... జాగ్రత్తగా వ్యవహరించి... అతన్ని లాకప్‌లో పెట్టారు. కోర్టుకు తీసుకెళ్లాక... నెక్ట్స్ ఏం చెయ్యాలో అది చేస్తామని చెబుతున్నారు.

పోలీసుల నుంచీ తప్పించుకోవడానికే... పిచ్చివాడిలా నటించేందుకు యత్నిస్తున్నాడని తెలుస్తోంది. ఐతే... అతను ఒక్కడే కాదనీ... అతని వెనక ముఠా ఉండి ఉండొచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి.First published: October 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు