Home /News /crime /

MOBILE PHONE CONTAINER ROBBERY IN GUNTUR SU

సినీ ఫక్కీలో రూ. 80 లక్షలు విలువ చేసే ఫోన్లు చోరీ

సెల్‌ఫోన్ల చోరీ

సెల్‌ఫోన్ల చోరీ

చిత్తూరు జిల్లాలో జరిగిన సెల్‌ఫోన్ల చోరీ మరవకముందే గుంటూరు జిల్లాలో అదే తరహా ఘటన చోటుచేసుకుంది. రూ. 80 లక్షలు విలువ చేసే మొబైల్ ఫోన్లను దొంగలు కాజేశారు.

    చిత్తూరు జిల్లాలో జరిగిన సెల్‌ఫోన్ల చోరీ మరవకముందే గుంటూరు జిల్లాలో అదే తరహా ఘటన చోటుచేసుకుంది. రూ. 80 లక్షలు విలువ చేసే మొబైల్ ఫోన్లను దొంగలు కాజేశారు. సిని ఫక్కీలో కంటైనర్‌లోకి చొరబడిన దుండగలు.. చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం కాజ టోల్‌పాజా వద్ద వెలుగుచూసింది. వివరాలు.. శ్రీసిటీ నుంచి సెలఫోన్ల లోడుతో కంటైనర్ కొల్‌కత్తాకు బయలుదేరింది. అయితే వెనుక తాళాలను కత్తిరించిన దుండలు.. కంటైనర్ లోనికి చోరబడి మొబైల్స్ కాజేశారు. అయితే కంటైనర్ కాజ టోల్ పాజా చేరుకున్న సమయంలో వెనక నుంచి వస్తున్న వాహనదారులు వెనక డోర్ల్ తెరుచుకుని ఉన్న విషయాన్ని డ్రైవర్‌కు తెలియజేశారు. దీంతో డ్రైవర్, సిబ్బంది మంగళగిరి రూరల్ పోలీసులకు ఆశ్రయించారు. మొత్తంగా దొంగలు కాజేసిన 980 రెడ్‌మి సెల్‌ఫోన్ల విలువ రూ. 80 లక్షలుగా ఉంటుందని తెలిసింది.

    ఘటనస్థలానికి చేరుకున్న గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి, నార్త్‌జోన్‌ డీఎస్పీ దుర్గాప్రసాద్‌ మంగళగిరి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కంటైనర్‌లో మొత్తం రూ. 9 కోట్ల విలువచేసే మొబైల్ ఫోన్లు ఉన్నాయని తెలిపారు. మధ్యప్రదేశ్, తమిళనాడుకు చెందిన గ్యాంగ్‌లు ఈ పనికి పాల్పడినట్టు అనుమానిస్తున్నామని అన్నారు. నిందితులను పట్టుకోవడానికి ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నామని చెప్పారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Guntur, Mobiles, Robbery

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు