Video : మోదీ ఇలాకాలో దారుణం.. పోలీసులను చెట్టుకు కట్టేసి రాళ్ల దాడి..

రాజన్ భరద్వాజ్‌ను కారులో ఎక్కించుకుని వెళ్తుండగా, నేరస్తులకు చెందిన అనుచరులు, కొందరు గ్రామస్తులు పోలీసులకు అడ్డుపడ్డారు

news18-telugu
Updated: October 29, 2019, 7:59 PM IST
Video : మోదీ ఇలాకాలో దారుణం.. పోలీసులను చెట్టుకు కట్టేసి రాళ్ల దాడి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వారణాశి జిల్లాలో ఘోరం జరిగింది. ఏకంగా విధుల్లో ఉన్న పోలీసులనే చెట్టుకు కట్టేసి కొట్టారు. ఇద్దరు నేరస్తులను అరెస్ట్ చేయడానికి వెళితే.. పోలీసులను అడ్డుకున్న గ్రామస్తులు వారిని చెట్టుకు కట్టేసి కొట్టారు. వారి సర్వీస్ రివాల్వర్లు కూడా లూటీ చేశారు. వారణాశి పొరుగున ఉండే హార్సోస్ గ్రామంలో ఇద్దరు నేరస్తులు రాజన్ భరద్వాజ్, రాహుల్ ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వారిద్దరూ బంధువుల ఇంట్లో భోజనానికి వచ్చినట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఇద్దరు పోలీసు అధికారులు, మరో ముగ్గురు పోలీసులను పిలిపించారు. ఆ ఇద్దరు క్రిమినల్స్‌ను పట్టుకోవాలని ప్లాన్ వేశారు. వారి పథకాన్ని అమలు చేసే క్రమంలో రాహుల్ తప్పించుకుని పారిపోయాడు. రాజన్ భరద్వాజ్ పోలీసులకు దొరికిపోయాడు.

రాజన్ భరద్వాజ్‌ను కారులో ఎక్కించుకుని వెళ్తుండగా, నేరస్తులకు చెందిన అనుచరులు, కొందరు గ్రామస్తులు పోలీసులకు అడ్డుపడ్డారు. బైక్ మీద వెళ్తున్న పోలీసులను పట్టుకుని కొట్టారు. రాళ్లతో దాడి చేశారు. బీభత్సంగా కొట్టిన తర్వాత గ్రామంలోని ఓ చెట్టుకు వారిని కట్టేశారు. తమను వదిలేయాలని పోలీసులు బతిమాలుతున్నా వినకుండా దాడి చేశారు. అనంతరం పోలీస్ అధికారుల వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్‌ను కూడా లూటీ చేసి పారిపోయారు.

ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను గ్రామస్తులు పట్టుకుని కొడుతున్నారంటూ తప్పించుకుని వెళ్లిన పోలీసులు పై అధికారులకు చెప్పారు. దీంతో రూరల్ ఎస్ఎస్‌పీ అదనపు బలగాలతో వెళ్లి గ్రామస్తులను చెదరగొట్టారు. పోలీసులను రక్షించారు. ఈ ఘటన కు సంబంధించి సుమారు 12 మందికి పైగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. రాజన్ భరద్వాజ్, రాహుల్ బంధువుల ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.First published: October 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు