గుజరాత్‌లో మూకదాడి..ఒకరి మృతి..!

గ్రామస్తుల దాడిలో అజ్మల్ అనే యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. బాదితులు ఇద్దరిపై గతంలో పలు కేసులు ఉన్నాయి. దొంగతనం, అల్లర్లు, మూక దాడుల కేసుల్లో జైలుకు కూడా వెళ్లారు.

news18-telugu
Updated: July 29, 2018, 1:42 PM IST
గుజరాత్‌లో మూకదాడి..ఒకరి మృతి..!
బాధితుడు చికిత్స పొందుతున్న ఆస్పత్రి
  • Share this:
దేశవ్యాప్తంగా మూక దాడులు కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా.. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినా..నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.తాజాగా గుజరాత్‌లో గిరిజనులు ఎక్కువగా ఉండే దాహోద్ జిల్లాలో దారుణం జరిగింది. దొంగలుగా భావించి ఇద్దరు వ్యక్తులపై స్థానికులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాళీ ముహుది గ్రామంలో ఈ ఘోరం జరిగింది.

దాహోద్ జిల్లా ఉందార్ గ్రామానికి చెందిన అజ్మల్ వహోనియా (22), అంబాలీఖజూరియా గ్రామానికి చెందిన భారు మాతుర్ రెండు రోజుల క్రితం జైలు నుంచి విడుదలయ్యారు. దొంగతనం  కేసుల్లో జైలుకెళ్లి బయటకొచ్చారు. వారు శనివారం రాత్రి కాళీముహుది గ్రామంలో సంచరిస్తుండగా స్థానికులకు అనుమానమొచ్చింది. దొంగతనం చేసేందుకు వచ్చారన్న అనుమానంతో గ్రామస్తులు వారిపై దాడి చేశారు. కర్రలు, రాళ్లతో విచక్షిణారహితంగా చితక్కొట్టారు.

గ్రామస్తుల దాడిలో అజ్మల్ అనే యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. బాదితులు ఇద్దరిపై గతంలో పలు కేసులు ఉన్నాయి. దొంగతనం, అల్లర్లు, మూక దాడుల కేసుల్లో జైలుకు కూడా వెళ్లారు. వారిపైనే ఇప్పుడు దాడి జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మూకదాడిపై సమాచారం అందుకున్నవెంటనే పోలీసులు చేరుకొని.. గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులను చూసి గ్రామస్తులంతా పారిపోయారు.

ఘటనపై హత్య, దాడి కేసులను నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదని తెలుస్తోంది. బాధితులపై పెండింగ్ కేసులు ఉన్నాయని పోలీసులు చెప్పారు. దాంతో తప్పుడు ప్రచారం కారణంగా మూకదాడితో పాటు పాత కక్షల కోణంలోనూ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

 
First published: July 29, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading