దారుణం : ముస్లిం కుటుంబంపై రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేసిన మూక

Mob Attacks Muslim Family : దాడికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో దాదాపు 10 మంది వ్యక్తులు ఆ సదరు ముస్లిం కుటుంబంపై దాడి చేయడం కనిపిస్తోంది. రాడ్లు, హాకీ బ్యాట్లతో వారిపై కిరాతకంగా దాడికి పాల్పడ్డారు. ఆ ఇంటి మహిళ దాడి చేయవద్దంటూ వేడుకున్నా.. వారు కనికరించలేదు.

news18-telugu
Updated: March 23, 2019, 1:49 PM IST
దారుణం : ముస్లిం కుటుంబంపై రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేసిన మూక
ముస్లిం కుటుంబంపై మూక దాడికి పాల్పడుతున్న దృశ్యం..
  • Share this:
హర్యానాలోని గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. ఓ ముస్లిం కుటుంబంపై కొంతమంది మూక ఐరన్ రాడ్లు, హాకీ బ్యాట్లు, వాటర్ పైప్స్‌తో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. వారి ఇంటిపై రాళ్లు రువ్వారు. దాడిలో మొత్తం 40మంది వరకు పాల్గొనట్టు సమాచారం. గురుగ్రామ్‌లోని భోండ్సిలో ఉన్న భూప్‌సింగ్ నగర్‌లో గురువారం ఈ దారుణం చోటు చేసుకుంది.

ఇంత దాడి జరిగినా.. పోలీసులు మాత్రం ఘటనను కేవలం వాగ్వాదం మాత్రమే అని చెప్పడం గమనార్హం. హోలీ సందర్భంగా క్రికెట్ ఆడుతున్నవేళ.. ఈ వివాదం తలెత్తిందని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు బాధిత కుటుంబం మాత్రం ఇది కొంతమంది హిందుత్వ వాదులు చేసిన దాడి అని ఆరోపిస్తున్నారు.దాడికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో దాదాపు 10 మంది వ్యక్తులు సదరు ముస్లిం కుటుంబంపై దాడి చేయడం కనిపిస్తోంది.

రాడ్లు, హాకీ బ్యాట్లతో వారిపై కిరాతకంగా దాడికి పాల్పడ్డారు. ఆ ఇంటి మహిళ దాడి చేయవద్దంటూ వేడుకున్నా.. వారు కనికరించలేదు. దాడిలో ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి తల పగిలి తీవ్ర రక్తస్రావంతో స్పృహ కోల్పోయాడు. దాడిలో గాయపడ్డ మరో వ్యక్తి చలనం లేకుండా ఓ మూలకు పడిపోయాడు. అయినప్పటికీ ఆ మూక అతనిపై దాడి ఆపలేదు.


గురువారం సాయంత్రం 5గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు. వీధిలో క్రికెట్ ఆడే విషయంపై తలెత్తిన వివాదమే దాడికి కారణమైందని బాధిత కుటుంబం చెబుతోంది. సదరు ముస్లిం కుటుంబ సభ్యులు ఇంటి ముందున్న వీధిలో క్రికెట్ ఆడుతుండగా.. కొంతమంది యువకులు అందుకు అభ్యంతరం చెప్పారు. వీధిలో క్రికెట్ ఆడవద్దన్నారు. అయితే హోలీ రోజు సాయంత్రం వారు క్రికెట్ ఆడటానికి వీధిలోకి రావడంతో దాదాపు 40మంది యువకులు వారి ఇంటి పైకి వచ్చి దాడికి పాల్పడ్డారు.దాడికి పాల్పడినవారిలో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వీడియో ఆధారంగా మరికొంతమంది నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.First published: March 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>