రైలు ప్రమాదంలో గాయపడిన MMTS డ్రైవర్ చంద్రశేఖర్ మృతి...
ఈనెల 11న హంద్రీనీవా ఎక్స్‌ప్రెస్‌ను ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లోకోపైలెట్ చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు.
news18-telugu
Updated: November 16, 2019, 10:18 PM IST

కాచిగూడ స్టేషన్లో ప్రమాద దృశ్యం
- News18 Telugu
- Last Updated: November 16, 2019, 10:18 PM IST
ఈనెల 11న కాచిగూడ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడిన ఎంఎంటీఎస్ లోకో పైలెట్ చంద్రశేఖర్ మృతిచెందాడు. ఐదు రోజుల నుంచి హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చంద్రశేఖర్ చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈనెల 11న హంద్రీనీవా ఎక్స్‌ప్రెస్‌ను ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్న ఈ ప్రమాదంలో సుమారు 30 మంది వరకు గాయాలయ్యాయి. ఎంఎంటీఎస్ రైలు బోగీలు కొన్ని పట్టాలు తప్పాయి. ఆ ఘటనలో ఎంఎంటీఎస్ లోకోపైలెట్ చంద్రశేఖర్ ఇంజిన్‌లోనే ఇరుక్కుపోయాడు. సుమారు 8 గంటల పాటు శ్రమించిన తర్వాత అతడిని ప్రాణాలతో బయటకు తీసి... ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల క్రితం అతడి కాలుకు శస్త్రచికిత్స చేసి దాన్ని తొలగించారు. హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లో ఈనెల 11న ఉదయం రైలు ప్రమాదం చోటు చేసుకుంది. హంద్రీ ఎక్స్‌ప్రెస్ రైలును లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. రెండు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇంజిన్లు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎంఎంటీఎస్ లోకో పైలట్ సహా 30 మందికి గాయాలయ్యాయి. డ్రైవర్ క్యాబిన్ నుజ్జునుజ్జవడంతో డ్రైవర్ లోపలే చిక్కుకుపోయాడు.
స్టేషన్లో సిగ్నల్‌ను గమనించుకుండా వెళ్లి ప్రమాదానికి కారణమైనందుకు ఎంఎంటీఎస్ లోకోపైలట్ చంద్రశేఖర్‌పై కేసు నమోదైంది. ఆర్పీఎఫ్,స్టేషన్ మేనేజర్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. తన కొడుకుని బలిపశువును చేసేందుకు ప్రయత్నంచేస్తున్నారంటూ చంద్రశేఖర్ తండ్రి గతంలో ఆరోపించారు.
స్టేషన్లో సిగ్నల్‌ను గమనించుకుండా వెళ్లి ప్రమాదానికి కారణమైనందుకు ఎంఎంటీఎస్ లోకోపైలట్ చంద్రశేఖర్‌పై కేసు నమోదైంది. ఆర్పీఎఫ్,స్టేషన్ మేనేజర్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. తన కొడుకుని బలిపశువును చేసేందుకు ప్రయత్నంచేస్తున్నారంటూ చంద్రశేఖర్ తండ్రి గతంలో ఆరోపించారు.
కాచిగూడ రైలు ప్రమాదం.. లోకో పైలట్ చంద్రశేఖర్ కుడి కాలు తొలగింపు
కాచిగూడ రైలు ప్రమాదం.. లోకోపైలట్ చంద్రశేఖర్‌పై కేసు నమోదు..
కాచిగూడ రైలు ప్రమాదం: MMTS డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి విషమం..
రైలు డ్రైవర్ క్షేమం.. 8 గంటల తర్వాత ఇంజిన్ నుంచి బయటకు..
డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం.. కాచిగూడ ఘటనపై రైల్వే అధికారులు
Loading...