Home /News /crime /

MLA SON AMONG FIVE BOOKED FOR GANG RAPE IN RAJASTHAN DAUSA PVN

Gang Rape : 10వ తరగతి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్..నిందితుల్లో ఎమ్మెల్యే కుమారుడు!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rape On Girl : పదో తరగతి బాలికపై ఐదుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడిన ఘటనపై  జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది  ​. నిందితులను వీలైనంత తొందరగా అరెస్ట్​ చేయాలని పోలీసులకు సూచించారు ఎన్​సీడబ్ల్యూ ఛైర్​పర్సన్​ రేఖా శర్మ. బాధితురాలికి భద్రత కల్పించి.. కౌన్సిలింగ్​ ఇవ్వాలని స్పష్టం చేశారు.

ఇంకా చదవండి ...
Gang Rape On 10th Class Girl : పదో తరగతి విద్యార్థినిపై ఐదుగురు ఐదుగురు దుండగులు దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. అంతేకాకుండా ఆ దుశ్చర్యను వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్​ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడి బాధితురాలి నుంచి రూ.15 లక్షల నగదు, బంగారు ఆభరణాలు తీసుకున్నారు. నిందితుల్లో ఓ ఎమ్మెల్యే కుమారుడు సైతం ఉండటం గమనార్హం.

రాజస్తాన్​ లోని దౌసా జిల్లాలోని మండవార్​ పోలీస్​ స్టేషన్​ ఎస్​హెచ్​ఓ నాథు లాల్​ తెలిపిన వివరాల ప్రకారం..గత నెల 24న దౌసా జిల్లాలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిని మహ్వా- మండవార్​ రోడ్డులోని ఓ హోటల్​కు తీసుకువెళ్లి మత్తు మందు ఇచ్చి ఐదుగురు దుండగులు గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకడైన వివేక్​ శర్మ.. గ్యాంగ్​ రేప్​ కు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడి బాధితురాలి నుంచి రూ.15 లక్షల నగదు, బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. ఇంట్లోంచి భారీగా నగదు, బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయిన క్రమంలో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయటం వల్ల ఈ కేసు వెలుగులోకి వచ్చింది. తొలుత దొంగతనం కేసు నమోదు చేశారు. దర్యాప్తులో వివేక్​ శర్మ ప్రమేయం ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలోనే తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాధితురాలు తల్లికి తెలపటం వల్ల గ్యాంగ్​ రేప్​ విషయం విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి వాంగ్మూలం నమోదు చేసినట్లు తెలిపారు నాథు లాల్​. నిందితుల్లో ఓ ఎమ్మెల్యే కుమారుడు సైతం ఉండటం గమనార్హం. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అల్వార్ జిల్లాలోని రాజ్​గఢ్​ ఎమ్మెల్యే కుమారుడు దీపక్​ మీనా సహా మిగిలిన నలుగురిపై అత్యాచారంతో పాటు ఇతర సెక్షన్ల కింద శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు.

ALSO READ Video Viral:రైల్వేస్టేషన్‌లో నిద్రపోతున్న ప్రయాణికుల పక్కన పడుకొని వాడేం చేశాడో చూడండి..

పదో తరగతి బాలికపై ఐదుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడిన ఘటనపై  జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది  ​. నిందితులను వీలైనంత తొందరగా అరెస్ట్​ చేయాలని పోలీసులకు సూచించారు ఎన్​సీడబ్ల్యూ ఛైర్​పర్సన్​ రేఖా శర్మ. బాధితురాలికి భద్రత కల్పించి.. కౌన్సిలింగ్​ ఇవ్వాలని స్పష్టం చేశారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Gang rape, Rajastan, Rape on girl

తదుపరి వార్తలు