హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..ఆ ముగ్గురిని అరెస్ట్ చేయడానికి సిట్ ఏం చేయబోతుంది?

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..ఆ ముగ్గురిని అరెస్ట్ చేయడానికి సిట్ ఏం చేయబోతుంది?

PC: Twitter

PC: Twitter

టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఎంతలా సంచలనం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్రభారతీ, నందకుమార్, సింహయాజిలను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుపై ప్రభుత్వం ప్రత్యేక సిట్ ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే సిట్ అధికారులు ఈ కేసులో అనుమానం ఉన్న కొందరికి నోటీసులు ఇచ్చారు. అందులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి BL సంతోష్, బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్, తుషార్, కేరళకు చెందిన జగ్గూజి అనే డాక్టర్ కు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. అయితే నిన్న కేవలం బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్ మాత్రమే సిట్ విచారణకు హాజరయ్యారు. మిగతా ముగ్గురు విచారణకు గైర్హాజరు అయ్యారు. ఈ క్రమంలో సిట్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఆ ముగ్గురిని అరెస్ట్ చేయబోతుందా? వారిని అరెస్ట్ చేసే అధికారం సిట్ కు ఉందా? అనే విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  Warangal: ఆటోని లాగడానికి వీళ్లు ఎందుకిత కష్టపడుతున్నారో చూడండి.. దీని వెనుక వేరే స్టోరీ ఉంది..

  సిట్ ఏం చేయబోతుంది?

  ఈ కేసుకు సంబంధించి సిట్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై హైకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందో అని ఆసక్తికరంగా మారింది. ఒకవేళ హైకోర్టు వారిని అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చినా కానీ సిట్ ఇతర రాష్ట్రాలకు వెళ్లి అరెస్ట్ చేయగలదా అనే అనుమానం రాక తప్పదు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో పోలీసులు కేంద్రం చేతుల్లోనే ఉన్నారు. ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉన్నా కానీ అక్కడకు సిట్ అధికారులు వెళ్లి అరెస్ట్ చేయాలంటే మాటలు కాదు.

  నోటీసుల్లో అరెస్ట్ చేస్తామని పేర్కొన్న సిట్..

  ఇక ఈ కేసులో ఆ నలుగురికి ఇచ్చిన నోటీసుల్లో అరెస్ట్ పై సిట్ అధికారులు పేర్కొన్నారు. ఒకవేళ విచారణకు రాకపోతే అరెస్ట్ చేస్తామని అందులో పేర్కొన్నారు. అయినా కానీ ఆ నోటీసులతో తమకేం సంబంధం లేదన్నట్టు ఆ ముగ్గురు వ్యవహరిస్తున్నారు. అయితే నోటీసులు ఇచ్చే క్రమంలో కూడా తమకు ఢిల్లీ పోలీసులు సహకరించడం లేదని సిట్ అధికారులు తెలంగాణ హైకోర్టు ముందు చెప్పుకొచ్చారు. అయితే నోటీసులను ఢిల్లీ పోలీసులకే ఇవ్వాలని వారే ఆ వ్యక్తులకు ఇస్తారని హైకోర్టు చెప్పుకొచ్చింది. అయితే అదే సమయంలో వారిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు తెలిపింది. ఇక ఇప్పుడు వారు విచారణకు రాకపోవడంతో వారిని అరెస్టు చేయాలనే అభ్యర్ధనను హైకోర్టు ముందు ఉంచనున్నారు. ఒకవేళ కోర్టు అరెస్టుకు అనుమతి ఇచ్చిన సిట్ అధికారులు బీజేపీ పాలిత ప్రాంతాలకు వెళ్లి అరెస్ట్ చేయడం సాధ్యం కానీ పని అనే చెప్పుకోవాలి. మరి వారి అరెస్టుపై ఎలాంటి పరిణామం చోటు చేసుకుంటుందో చూడాలి.

  First published:

  Tags: Bjp, Delhi, Hyderabad, Telangana, Trs, TRS leaders, TRS MLAs Poaching Case

  ఉత్తమ కథలు