హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking: క్లాస్ లో అందరిముందే బాలిక బట్టలు విప్పించిన మహిళా టీచర్.. ఎక్కడంటే..

Shocking: క్లాస్ లో అందరిముందే బాలిక బట్టలు విప్పించిన మహిళా టీచర్.. ఎక్కడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mizoram: బాలికను క్లాస్ తో మరో బాలుడు తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమెకు గాయలయ్యాయి. కొన్నిరోజుల తర్వాత.. బాలిక మరోసారి స్కూల్ కు వచ్చింది. అప్పుడు కూడా అతను మరోసారి బాలికపై దాడికి పాల్పడ్డాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Mizoram, India

స్కూల్ లో కొందరు పిల్లలు చిన్నతనం నుంచి మొండిగా ప్రవర్తిస్తుంటారు. పెద్దవారు చెప్పినట్లు అసలు వినరు. వీరు స్కూల్ కు వెళ్లిన, తోటి విద్యార్థులతో మొండిగానే ప్రవర్తిస్తుంటారు. అయితే.. కొన్నిసందర్భాలలో ఇతరులపై దాడులు కూడా చేస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.


పూర్తి వివరాలు.. మిజోరాంలోని (Mizoram)  లుంగ్లీ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోనికి వచ్చింది. తంగ్ పుయ్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో.. ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థిని యూనిఫామ్ అను అదే పాఠశాలకు చెందిన టీచర్ విప్పించింది. కేంద్రం యొక్క సర్వశిక్షా అభియాన్ కింద రిక్రూట్ చేయబడిన లాల్బియాకెంగిగా గుర్తించబడిన కాంట్రాక్టు మహిళా టీచర్ ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. బాలికను, తోటి విద్యార్థి గాయపర్చాడు. దీంతో ఆమెను కొన్నిరోజుల పాటు ఇంట్లోనే ఉంచుకున్నారు. ఆ తర్వాత... మరోసారి స్కూల్ కు పంపించగా, అతను దాడిచేశాడు. దీంతో బాలిక తల్లి, స్కూల్ కు వచ్చి, ఆ బాలుడిని తిట్టింది.దీంతో స్కూల్ టీచర్.. కోపంతో బాలిక తల్లికి కాల్ చేసింది. ఇలా చేయడం సరికాదని చెప్పింది. ఈ క్రమంలో కోపంతో బాలిక తల్లి.. పాఠశాలకు వచ్చింది. తన కూతురుని ఇంటికి తీసుకెళ్తానని చెప్పింది. అయితే.. స్కూల్ యూనిఫామ్ తీసేసి.. బాలికను ఇంటికి తీసుకెళ్లిపోవచ్చని టీచర్ తెగేసి చెప్పింది. దీంతో వేరమార్గం లేక బాలిక దుస్తులు తీసేసి, కేవలం లోదుస్తుల మీదనే ఆమె తను కూతురుని ఇంటికి తీసుకెళ్లింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది.


ఈ క్రమంలో లాల్బియా కెంగిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కాగా, ఆగస్టు 22న పాఠశాలలో తన కుమార్తెపై బాలుడు శారీరకంగా దాడి చేశాడని, అందులో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయని, తక్షణ వైద్యం అందించాలని బాలిక తల్లి తన ఫిర్యాదులో పేర్కొంది. "మూడు రోజుల పాటు వైద్యం చేయించుకున్న ఆమె తిరిగి పాఠశాలకు వెళ్లాలని పట్టుబట్టడంతో, గురువారం (ఆగస్టు 25) అదే బాలుడిచే మళ్లీ కొట్టబడటానికి మేము ఆమెను పాఠశాలకు పంపాము" అని తల్లి ఆరోపించింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.First published:

Tags: Crime news, Mizoram, School girl

ఉత్తమ కథలు