మమ్మల్ని కొనండి... తాగునీరు ఇవ్వండి... యూపీ యువకుల నిరసన

Mission Paani | మంచినీళ్లు లేక అల్లాడిపోతున్న తమ ఊరి ప్రజల కష్టాలు ప్రభుత్వానికి తెలిసేందుకు అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు ముందుకొచ్చారు. తమను తాము వేలం వేసుకుని ఘటనను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

news18-telugu
Updated: August 23, 2019, 5:35 PM IST
మమ్మల్ని కొనండి... తాగునీరు ఇవ్వండి... యూపీ యువకుల నిరసన
తాగునీటి కోసం యువకుల నిరసన
  • Share this:
తమ గ్రామానికి తాగునీరు అందించాలని ఆ ఊరి ప్రజలు ఎన్నో సార్లు అధికారులు, పాలకుల చుట్టూ తిరిగారు. కానీ ఎవరూ వారి కష్టాలను పట్టించుకోలేదు. మంచినీళ్లు లేక అల్లాడిపోతున్న తమ ఊరి ప్రజల కష్టాలు ప్రభుత్వానికి తెలిసేందుకు అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు ముందుకొచ్చారు. వినూత్నంగా నిరసన తెలిపి తమ సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్లేలా చేయాలనుకున్నారు. ఇందుకోసం గణతంత్ర దినోత్సవాన్ని ఎంచుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లా నగ్లమయ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

గ్రామంలోని 50 మంది యువకులు తమను తాము వేలం వేసుకుని ఘటనను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తమ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న దాదాపు 60 గ్రామాల్లోనే లక్షలాది మంది ప్రజలు తాగునీరు లేక అల్లాడిపోతున్నారని వివరించారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో తమను తాము వేలం వేసుకుని ఆ డబ్బుతో తాగునీటి సమస్యలు తీర్చాలని భావిస్తున్నామని తెలిపారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్... వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామని అన్నారు. అయితే తమ సమస్య పరిష్కారం కాకపోతే... మరోసారి జిల్లా స్థాయిలో ఈ తరహా నిరసన తెలుపుతామని యువకులు స్పష్టం చేశారు.

First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు