Home /News /crime /

MISSING MINOR GIRL TRACED IN KARIMNAGAR MS KNR

బడి పాఠాలు వినమంటే.. ప్రేమ పాఠాలు నేర్చుకున్న బాలిక.. ప్రేమికుడి కోసం జిల్లాలు దాటిన వైనం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆన్లైన్ తరగతులు వినేందుకు తల్లిదండ్రులు తమ కూతురికి స్మార్ట్ ఫోన్ కొనిస్తే...ఆ బాలికను దానిని మరో విధంగా ఉపయోగించుకుంది. సోషల్ మీడియా మోజులో పడి.. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన బాలుడితో ఉడాయించింది.

  • News18
  • Last Updated :
    దూరాలను దగ్గర చేయాల్సిన స్మార్ట్ ఫోన్లు మనుషుల బావోద్వేగాలతో ఆడుకుంటున్నాయి. ముఖ్యంగా పసి హృదయాలను పాడు చేస్తున్నాయి. అన్నెంపున్నెం ఎరుగని ఆ పసిపిల్లల మనుసులో సోషల్ మీడియా అనే విషపు పురుగు ప్రవేశించి.. వారి బంగారు భవిష్యత్తును అంధకారం చేస్తున్నది. ఇక కరోనా వచ్చినాక ఫోన్ల వాడకం అత్యంత దారుణంగా పెరిగింది. పిల్లలకు ఆన్లైన్ క్లాసులేమో గానీ.. వారి జీవితాలు ప్రమాదంలో పడే పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఆన్లైన్ తరగతులు వినేందుకు తల్లిదండ్రులు తమ కూతురికి స్మార్ట్ ఫోన్ కొనిస్తే...ఆ బాలికను దానిని మరో విధంగా ఉపయోగించుకుంది. సోషల్ మీడియా మోజులో పడి.. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన బాలుడితో ఉడాయించింది. బాలికకు మాయమాటలు చెప్పిన ఆ బాలుడు.. ఏకంగా తాను ఉండే ప్రాంతానికి రప్పించుకున్నాడు. ఇంట్లో ఉండాల్సిన కూతురు కనిపించకపోవడంతో బాధిత కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు గుట్టు వెలుగులోకి వచ్చింది.

    వివరాల్లోకెళ్తే.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(13) స్థానికంగా ఉన్న పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్నది. ఇంట్లోనే ఆన్ లైన్ తరగతులు వినేందుకు తల్లిదండ్రులు ఆమెకు స్మార్ట్ ఫోన్ కొన్నారు. అయితే ఆ బాలిక ఫోన్ లో బడి పాఠాలు వినాల్సింది పోయి ప్రేమ పాఠాలు వింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన కరీంనగర్ ప్రాంతానికి చెందిన ఓ బాలుడు (16 ).. బాలికకు మాయమాటలు చెప్పి ఆరు మాసాలుగా ప్రేమాయణం సాగిస్తున్నాడు.

    ఇదే క్రమంలో.. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాలిక బయటకు వెళ్లిపోయింది. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు కూతురు కన్పించకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. ఎంతకీ జాడ దొరక్కపోవడంతో అదేరోజు రాత్రి మొయినాబాద్ పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు... కరీంనగర్ లో ఉన్న బాలుడిని కలవడానికి ఆ బాలిక హైదరాబాద్ లోని జూబ్లీ బస్టాండ్ కు చేరుకుంది. తనవద్ద డబ్బు అయిపోవడంతో బస్టాండులోని బేకరీ యజమాని ఫోన్ తో కరీంనగర్ లోని బాలుడికి విషయం చెప్పింది. సదరు బేకరీ యజమాని ఫోన్ కు బాలుడు ఫోన్ పే ద్వారా రూ. 400 పంపించాడు. జూబ్లీ బస్టాండ్ లో బస్ ఎక్కి.. రాత్రి 10 గంటలకు కరీంనగర్ చేరుకుంది. అనంతరం బాలుడు నేరుగా బాలికను తన ఇంటికి తీసుకువెళ్లాడు.

    ఈ కథ ఇలా ఉంటే.. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంతకుముందు బాలిక తన స్నేహితురాలికి సైతం బేకరి యాజమాని ఫోన్ నుంచి మాట్లాడింది. దీంతో స్నేహితురాలి ఫోన్ కు వచ్చిన నంబరు ఆధారంగా పోలీసులు.. జూబ్లీ బస్టాండ్ కు చేరుకొని బేకరి యజమానితో మాట్లాడారు. కరీంనగర్ కు చెందిన యువకునితో ఫోన్ లో మాట్లాడటంతో అదేరోజు రాత్రి పోలీసులు కరీంనగర్ కు చేరుకుని బాలికను సురక్షితంగా మొయినాబాద్ కు తీసుకురావడంతో ఆమె తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
    Published by:Srinivas Munigala
    First published:

    Tags: Crime, Karimnagar, Love, Minor girl, Missing case, Online classes, Rangareddy, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు