Missing Cases: వీళ్లు ఏమయ్యారు... అమరావతి మిస్సింగ్ కేసుల్లో ఇంకా దొరకని ఆచూకీ

Missing Cases: అమరావతి మిస్సింగ్ కేసులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు తెలియకపోవడంతో పోలీసులు తలలుపట్టుకుంటున్నారు. వీటి విచారణ పలు బృందాలను ఏర్పాటు చేశారు.

news18-telugu
Updated: November 4, 2020, 7:08 PM IST
Missing Cases: వీళ్లు ఏమయ్యారు... అమరావతి మిస్సింగ్ కేసుల్లో ఇంకా దొరకని ఆచూకీ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రసిద్ధి చెందిన అమరావతికి దేశవిదేశాల నుంచి ఎంతోమంది పర్యాటకులు, భక్తులు, వస్తుంటారు .ఇటువంటి ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రం లో పోలీసుల నిఘా, భద్రత వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉండాలి. కానీ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అమరావతిలోనే దసరా రోజున విహారయాత్రకు వచ్చిన 14 సంవత్సరాల బాలుడు తప్పిపోయినట్టు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ కేసులో ఇంతవరకు పురోగతి లేకపోవటం నిఘా, భద్రత వ్యవస్థలో ఉన్న డొల్లతనాన్ని బయటపెడుతోంది. ఆ తరువాత రోజే ఆ మరునాడే అమరావతికి అతి సమీపంలోని పాటిబండ్లకు చెందిన నాలుగేళ్ల కీర్తి.. తన జన్మదినం రోజునే కనిపించకుండా పోయింది. ఈ కేసులో కూడా ఇంతవరకు పురోగతి లేదు.

ఆ చిన్నారి మాయమైన రోజున యాచకురాలు ఒకరు బిక్షాటన చేసిందని ఆమె చిన్నపిల్లతో తిరిగి వెళ్లిందని ఆ గ్రామానికి చెందిన ఒక బాలుడు పోలిసులకు సమాచారం అందించాడు. అసలు ఆమె ఎక్కడ నుండి వచ్చింది ఎలా వెళ్లిందనే కోణంలో పోలీసులు ఆ గ్రామ నుండి పెదకూరపాడు, అమరావతి వెళ్లే రహదారుల్లో ఉన్న సీసీ ఫుటేజీని సేకరించి విశ్లేషించారు. అయితే ఇంతవరకు పోలీసులకు ఎటువంటి ఆచూకీ లభ్యం కాలేదని తెలుస్తోంది. సీసీ కెమెరాలు ఊరికి దూరంగా ఉండటం.. వాటిలో ఎక్కువ ఫుటేజి నిల్వ సామర్ధ్యం లేకపోవటం, తక్కువ సంఖ్యలో సీసీ కెమెరాలు ఉండటంతో ఆ యాచకురాలి ఆచూకీని తెలుసుకోవటంలో పోలీసులు సక్సెస్ కాలేకపోతున్నారు. యాచకురాలిని ఆమెకు సంబంధించిన వారు పల్సర్ బండిపై దింపి వెళ్లినట్లు గ్రామస్థులు కొందరు చెబుతున్నారు. తమకు ఎక్కడ పల్సర్ బండి మీద వారు ప్రయాణించినట్లు తాము సీసీ ఫుటేజ్ గుర్తించలేదని పోలీస్ వర్గాలు చెపుతున్నాయి. ఈ ప్రాంతాల్లో నిఘా కెమెరాలు తక్కువగా ఉన్నాయని మరి కొన్ని ఏర్పాటు చేయాలని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

హైదరాబాద్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు తన సహచరులతో కలసి దసరా పండుగ రోజున అమరావతికి విహార యాత్రకి వచ్చి అమరేశ్వరాలయం, ధ్యానబుద్ధ ప్రాజెక్ట్, పర్యటించిన ఆధారాలు లభ్యమయ్యాయి. ఆ బాలుని సహచరులు కూడా తమతో పాటు పర్యటించాడని తెలిపారు. వాళ్లు ఇక్కడికి వచ్చినప్పుడు కృష్ణా నది ఉదృతంగా ప్రవహిస్తుండటంతో బాలుడు ఘాట్లలో కొట్టుకుపోయాడేమో అనే కోణంలో ఒక బృందాన్ని విచారణ కొరకు గోదావరి వరకు ఉన్న గేట్ల వెంబడి పరిశీలనకు పంపామని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. ఈ మిస్సింగ్ కేసులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు తెలియకపోవడంతో పోలీసులు తలలుపట్టుకుంటున్నారు. వీటి విచారణ పలు బృందాలను ఏర్పాటు చేశారు.
Published by: Kishore Akkaladevi
First published: November 4, 2020, 7:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading