దేశంలో మహిళలు, అమ్మాయిలు భద్రత పెనుసవాల్ గా మారింది. ప్రతి రోజు మహిళలపై అఘాయిత్యాల ఘటనలు వెలుగులోనికి వస్తున్నాయి. ప్రభుత్వాలు.. దిశ, నిర్భయ, పోక్సో వంటి ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన కామాంధులు మాత్రం మారడం లేదు. మహిళలపై దాడులు, అఘాయిత్యాల (Harassment on woman) ఘటనలు ప్రతి రోజు వార్తలలో ఉంటున్నాయి. కీచకులు.. పసిపాప నుంచి పండు ముసలి వరకు ఏ ఒక్కరిని వదలడం లేదు. మరికొందరైతే మరీ నీచంగా ఆవులు, కుక్కలు, మేకల వంటి మూగ జీవాలపై కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి జుగుప్సాకర ఘటనలు కూడా వార్తలలో ఉంటున్నాయి. మైనర్లు, ముసలోళ్లు అని తేడా లేకుండా అన్ని వయస్సుల వారు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) దారుణం జరిగింది. కిడ్నాప్ కు గురైన బాలిక, సాముహిక అత్యాచారానికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. పోలీసుల ప్రకారం.. 13 ఏళ్ల బాలిక ఏప్రిల్ 24 సాయంత్రం కూరగాయల కోసం ఇంటి నుంచి బైటకు వెళ్లింది. ఒక ఆటోలో ఎక్కింది. దాన్ని షారుక్ అనే బాలుడు నడుపుతున్నాడు. అతను బాలికకు మాయమాటలు చెప్పాడు. ఆమెకు కూల్ డ్రింక్ ఇచ్చాడు. బాలిక కూల్ డ్రింక్ తాగి స్పృహతప్పి పడిపోయింది. వెంటనే బాలికను కిడ్నాప్ చేసి టీగ్రీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఒక ఇంటిలో బాలికకు డ్రగ్స్ ఇచ్చారు.
ఆ తర్వాత.. ఆమెపై మోహిత్ (20), ఆకాష్ (19), షారుక్ (20) లు పలుమార్లు అత్యాచారం చేశారు. ఈ క్రమంలో బాలిక కనపడకపోవడంతో ఆమె తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక కోసం ఊరంతా పోస్టర్ లు అతికించారు. ఈ క్రమంలో బాలిక టిగ్రీ లో ఉన్నట్లు పోలీసులు ఇన్ ఫార్మర్ ల ద్వారా తెలుసుకున్నారు. ఆ తర్వాత నిందితులు.. బాలికను ఒ రైల్వే స్టేషన్ దగ్గర వదిలేసి పారిపోయారు. వెంటనే స్థానికులు బాలిక విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు బాలికను మెడికల్ టెస్ట్ ల కోసం ఎయిమ్స్ కు తరలించారు. బాలికను చూసిన వైద్యులు.. ఆమెకు డ్రగ్స్ ఇచ్చి, అత్యాచారం చేశారని తెలిపారు. ఈ మేరకు బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా ఆధారంగా.. మోహిత్ (20), ఆకాష్ (19), షారుక్ (20) లను అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Delhi, Gang rape, Harassment