• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • MISHEL SHAJI FATHER SPOKE ABOUT THE FAMILY FIGHT TO KNOW HOW THEIR DAUGHTER ENDED UP DEAD SSR

సమాధానం కోసం ఎదురుచూస్తున్న ఈ యువతి కుటుంబం కోసం ఏ వకీల్ సాబ్ వస్తాడో..!

సమాధానం కోసం ఎదురుచూస్తున్న ఈ యువతి కుటుంబం కోసం ఏ వకీల్ సాబ్ వస్తాడో..!

మిషెల్ షాజి (ఫైల్ ఫొటో)

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడంతో సోషల్ మీడియా స్త్రీలను గౌరవించే పోస్టులతో హోరెత్తుతోంది. ఎవరి వాట్సాప్ స్టేటస్ చూసినా వకీల్ సాబ్ ‘మగువా.. మగువా’ పాటతో, బాలకృష్ణ ‘వినాస్త్రీయ జననం నాస్తి’ డైలాగ్ సీనే కనిపిస్తోంది. ఇవాళ ఒక్కరోజు ఇంతలా...

  • Share this:
    కొచ్చి: మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావడంతో సోషల్ మీడియా స్త్రీలను గౌరవించే పోస్టులతో హోరెత్తుతోంది. ఎవరి వాట్సాప్ స్టేటస్ చూసినా వకీల్ సాబ్ ‘మగువా.. మగువా’ పాట గానీ, బాలకృష్ణ ‘వినాస్త్రీయ జననం నాస్తి’ డైలాగ్ సీన్ గానీ కనిపిస్తోంది. ఇవాళ ఒక్కరోజు ఇంతలా మహిళల పట్ల విశేష గౌరవం చూపించే సమాజం రేపటి నుంచి వారి కష్టాలను, కన్నీళ్లను కూడా పట్టించుకోదు. ఎప్పటిలానే స్త్రీలు బాధితులుగా మిగిలిపోతున్నారు. అలాంటి ఓ బాధితురాలే కేరళకు చెందిన మిషెల్ షాజి. ఆమె చనిపోయి ఇప్పటికి నాలుగేళ్లు దాటింది. 2017 మార్చి 6న ఆమె చనిపోయింది. సీఏ స్టూడెంట్ అయిన షాజి మృతదేహం కొచ్చిలోని వెంబనాడు లేక్ దగ్గర అనుమాస్పద స్థితిలో మార్చి 6, 2017న కనిపించింది. ఆమె మృతి వెనకున్న మిస్టరీ ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఆమె ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నప్పటికీ షాజి తల్లిదండ్రులు, తమ్ముడు మాత్రం ఆమెను హత్య చేసి అక్కడ పడేశారని బలంగా నమ్ముతున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తప్పు జరిగిందని చెబుతున్నారు.

    స్థానిక పోలీసులతో పాటు, కేరళ క్రైం బ్రాంచ్ కూడా ఈ కేసును విచారిస్తోంది. కానీ.. షాజి అనుమానాస్పద మృతి కేసులో విచారణ ఇప్పటికీ ముగింపు దశకు చేరుకోలేదు. షాజి తల్లిదండ్రులు తమ కుమార్తె మృతి కేసును సీబీఐకి అప్పగించాలని అప్పటి నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కేరళ సీఎంను కలిసి మొరపెట్టుకున్నారు. కానీ.. ఆ ప్రయత్నం ఫలించలేదు. దీంతో.. తమ కుమార్తె అనుమానాస్పద మృతిపై న్యాయ విచారణ జరిపించాలని షాజి తల్లిదండ్రులు తాజాగా డిమాండ్ చేస్తున్నారు. మిషెల్ తండ్రి ఈ కేసు గురించి మాట్లాడుతూ.. పోలీసులు తమ కుమార్తె కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేసినప్పుడు సక్రమంగా స్పందించి ఉంటే ఈరోజు మా బిడ్డ బతికుండేదని కన్నీరుమున్నీరయ్యారు.

    ఇది కూడా చదవండి: ఈ దృశ్యం సీఎం జగన్ కంటపడిందో.. లేదో.. చూస్తే మాత్రం ఫుల్ హ్యాపీ.. విషయమేంటంటే..



    మార్చి 5, 2017న హాస్టల్ నుంచి వెళ్లిన మిషెల్ తిరిగిరాలేదని.. అదే రోజు ఆమె కనిపించకుండా పోయిందని ఆయన చెప్పారు. తమ కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేసేందుకు కొచ్చి నగరంలోని మూడు పోలీస్ స్టేషన్లకు వెళ్లినా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. తొలుత.. తన భార్య, తానూ కలిసి వనిత పోలీస్ స్టేషన్‌కు వెళ్లామని.. వాళ్లు ఫిర్యాదు స్వీకరించలేదని.. కసబ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని సూచించడంతో అక్కడికీ వెళ్లామని చెప్పారు. కసబ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.. ఈ కేసు తమ పరిధిలోకి రాదని చెప్పి.. సెంట్రల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని చెప్పారని ఆయన పేర్కొన్నారు. తమ కూతురును కాపాడుకోవాలన్న ఆశతో సెంట్రల్ స్టేషన్‌కు వెళ్లామని మిషెల్ తండ్రి చెప్పారు. అక్కడ కూడా ఈ తండ్రికి నిరాశే ఎదురైంది. ఎస్‌ఐ అందుబాటులో లేరని, ఉదయాన్నే రావాలని అక్కడున్న పోలీసులు చెప్పారని ఆయన తెలిపారు.

    ఇలా.. తమ కుమార్తె ఆచూకీ కనిపెట్టేందుకు ఏ ఒక్క పోలీసూ ముందుకు రాలేదని.. మరుసటి రోజు తమ కూతురు విగత జీవిగా కనిపించిందని ఆ ఘటనను గుర్తుచేసుకుని మిషెల్ షాజి తండ్రి బోరున విలపించారు. ఆమె అనుమానాస్పద స్థితిలో చనిపోయిన సందర్భంలో కేరళలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆమె మరణం వెనకున్న మిస్టరీని తేల్చాలని ప్రజా సంఘాలతో పాటు, సెలబ్రెటీలు కూడా డిమాండ్ చేశారు. కొన్ని రోజుల తర్వాత అందరూ మిషెల్ షాజిని మర్చిపోయారు. తమ కుమార్తె మృతి వెనకున్న మిస్టరీపై ఇప్పటికీ ఈ కుటుంబానికి సమాధానం దొరకలేదు.
    Published by:Sambasiva Reddy
    First published: