విజయవాడలో ఘోరం.. మహిళ గొంతు కోసి బంగారం చోరీ..

నగల కోసం ఓ మహిళను గొంతు కోసి దారుణంగా చంపారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న నగలను కాజేసి అక్కడి నుంచి పరారయ్యారు. తమ ఆనవాళ్లు పోలీసులకు దొరకుండా ఘటనాస్థలంలో కారంపొడి చల్లారు.


Updated: January 31, 2020, 9:46 PM IST
విజయవాడలో ఘోరం.. మహిళ గొంతు కోసి బంగారం చోరీ..
మృతురాలు
  • Share this:
విజయవాడ నడిబొడ్డున ఘోరం జరిగింది. భవానీపురంలో దుండగులు కిరాతకానికి పాల్పడ్డారు. నగల కోసం ఓ మహిళను గొంతు కోసి దారుణంగా చంపారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న నగలను కాజేసి అక్కడి నుంచి పరారయ్యారు. తమ ఆనవాళ్లు పోలీసులకు దొరకుండా ఘటనాస్థలంలో కారంపొడి చల్లారు. భవానీపురంలోని పాండు హోటల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతురాలిని యేదుపాటి పద్మావతిగా గుర్తించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి నిందితుల కోసం గాలిస్తున్నారు. సంఘటనా స్థలం చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: January 31, 2020, 9:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading