US Murder: సేఫ్టీ లేని అమెరికా... దుండగుల చేతిలో హైదరాబాదీ దారుణ హత్య

Hyderabadee Murder in America: దేశం కాని దేశానికి వెళ్లి... నాలుగు రాళ్లు సంపాదిద్దామనుకుంటే... అక్కడి దుండగులు ఏకంగా ప్రాణాలే తీసేశారు.

news18-telugu
Updated: November 3, 2020, 12:13 PM IST
US Murder: సేఫ్టీ లేని అమెరికా... దుండగుల చేతిలో హైదరాబాదీ దారుణ హత్య
దుండగుల చేతిలో హైదరాబాదీ దారుణ హత్య (credit - twitter)
  • Share this:
Murder in America: హైదరాబాద్‌కు చెందిన 37ఏళ్ల మహ్మద్ ఆరిఫ్ మొహియుద్దీన్‌ అమెరికాలో ప్రాణాలు కోల్పోయాడు. పాతబస్తీ చంచల్ గూడకు చెందిన ఆరిఫ్‌ పదేళ్లుగా అమెరికా... జార్జియాలో ఉంటున్నాడు. అక్కడే ఓ షాపు పెట్టుకొని... ఎంతో కొంత సంపాదిస్తూ... జీవనం సాగిస్తున్నాడు. ఐతే... ఆదివారం తన ఇంటి దగ్గర ఏదో కలకలం రేగింది. రకరకాల వింత శబ్దాలు వినిపించాయి. ఏంటా అని ఆరిఫ్ ఇంట్లోంచీ బయటకు వచ్చాడు. అంతే.. దుండగులు ఒక్కసారిగా అతనిపై మూగారు. కత్తితో కసక్కున పొడిచారు. ఎవరో, ఎందుకు అలా చేశారో ఎవ్వరికీ తెలియదు. కసా కసా పొడిచేసిన దుండగులు... అంతే వేగంగా అక్కడి నుంచి పారిపోయారు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఆరిఫ్ నేలపై పడి గిలగిలా కొట్టుకుంటూ... అరుస్తుంటే... స్థానికులు... ఆస్పత్రికి తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్ పొందుతూ ప్రాణాలు విడిచాడు.

దుండగులు దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అందులో కొంత మంది వ్యక్తులతోపాటూ... ఆ షాపులో పనిచేసే ఉద్యోగి కూడా ఉన్నట్లు తెలిసింది. ఆరిఫ్ మృతి విషయాన్ని హైదరాబాద్‌లోని ఆరిఫ్‌ కుటుంబ సభ్యులకు జార్జియా పోలీస్ అధికారులు తెలిపారు. దీంతో తను, తన తండ్రి అత్యవసర వీసాపై అమెరికా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని ఆరిఫ్‌ భార్య మెహ్నాజ్ ఫాతిమా కోరుకున్నారు. అమెరికాలో తమకు బంధువులెవరూ లేరని, భర్త అంత్యక్రియలు జరిపేందుకు అక్కడకు వెళ్లేందుకు ప్రభుత్వం సాయం చేయాలని ఆమె కోరారు. "ఆదివారం ఉదయం 9 గంటలకు నా భర్తతో మాట్లాడాను. తను అరగంటలో తిరిగి కాల్‌ చేస్తానని చెప్పారు. ఆ తర్వాత కాల్ చెయ్యలేదు." అని ఫాతిమా తెలిపారు.

"నా భర్త కాల్ కోసం ఎదురుచూస్తుంట... కాసేపటి తర్వాత బావ నుంచి కాల్ వచ్చింది. నా భర్తను ఎవరో పొడిచి చంపినట్లు ఆయన తెలిపారు. జార్జియాలోని ఆసుపత్రిలో ఉన్న నా భర్త మృతదేహానికి అంతిమ సంస్కారాలు జరిపేందుకు అక్కడ కుటుంబ సభ్యులు ఎవరూ లేరు" అని ఆమె కన్నీళ్లు పెట్టారు. తెలంగాణకు చెందిన పార్టీ మజ్లిస్ బచావో తెహ్రీక్ (MBT) ప్రతినిధి ఉల్లా ఖాన్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తోపాటు అమెరికాలోని భారత ఏంబసీకి ఫాతిమాను అమెరికా పంపించాలని కోరుతూ లేఖ రాశారు. ఇలా... దేశ కాని దేశానికి వెళ్లి... అన్యాయంగా దుండగుల చేతిలో బలైపోయాడు ఆరిఫ్. ఇలా ఎంతో మంది భారతీయులను చంపేస్తున్నారు దుండగులు. అమెరికాలో గన్ కల్చర్ కారణంగా కూడా... సామాన్యుల ప్రాణాలకు సేఫ్టీ లేకుండా పోతోంది.
Published by: Krishna Kumar N
First published: November 3, 2020, 12:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading