Home /News /crime /

Andhra Pradesh: మీర్జాపూర్ వెబ్ సిరీస్ చూశాడు: సెలవులపై వచ్చి 5 కోట్లకు స్కెచ్ వేసి.. చివరికి బుక్కయ్యాడు ఓ ఆర్మీ జవాన్!

Andhra Pradesh: మీర్జాపూర్ వెబ్ సిరీస్ చూశాడు: సెలవులపై వచ్చి 5 కోట్లకు స్కెచ్ వేసి.. చివరికి బుక్కయ్యాడు ఓ ఆర్మీ జవాన్!

వెబ్ సిరీస్ చూసి.. 5 కోట్లకు స్కెచ్ వేసి పోలీసులకు చిక్కాడు ఓ ఆర్మీ జవాన్

వెబ్ సిరీస్ చూసి.. 5 కోట్లకు స్కెచ్ వేసి పోలీసులకు చిక్కాడు ఓ ఆర్మీ జవాన్

అతడు ఒక ఆర్మీ జవాను.. సెలవులపై ఇంటికి వచ్చాడు.. బాలీవుడ్ వెబ్ సిరీస్ చూసి.. 5 కోట్ల రూపాయలు కొట్టేయడానికి స్కెచ్ వేశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. ఇంతకీ ఏం జరిగింది?

  ఇటీవల సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్ ఇలా కథ ఏదైనా కానీ.. వాస్తవాల ఆధారంగా రూపొందిస్తున్నారు. యధార్థ ఘటన ఆధారంగా అని చెబుతూ ఉంటారు కూడా. చాలా వరకు నిజ జీవితంలో ఘటనల ఆధారంగా కథలు పుట్టుకొస్తున్నాయి. అయితే కొందరు ఆ కథలను చూసి.. అందులోని పాత్రలో తమను ఊహించుకుంటున్నారు. నేరాలకు స్కెచ్ లు వేస్తున్నారు. అయితే ఇది సినిమా కాదు రియల్ లైఫ్ అని తెలుసుకోలేకపోతున్నారు..

  తాజగా క్రైమ్ వెబ్ కంటెంట్ చూసి నేరాల బాట పట్టాడు ఓ వ్యక్తి. అది కూడా అతడు సాధారణ వ్యక్తి కాదు.. ఓ ఆర్మీ ఉద్యోగి.. మీర్జాపూర్ వెబ్ సిరీస్ చూసి.. ఆ కథలోని క్రైమ్ ను ఫాలో అయిపోయాడు. నకిలీ మావోయిస్టు అవతారమెత్తాడు. రూర్కి కంటోన్మెంట్‌లో సోల్జర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రాజేశ్వరరావు ఈజీ మనీ కోసం బంగారం వ్యాపారిని టార్గెట్ చేశాడు. మావోయిస్టు పేరుతో బెదిరింపులకు పాల్పడడమే కాకుండా ఏకంగా ఐదు కోట్లు డిమాండ్ చేశాడు.

  పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం. ఈ నెల 7వ తేదీన సాయంత్రం 4 గంటలకు పార్వతీపురంలోని పాలకొండు రోడ్డులో గల తన ఇంటి కిటికీ అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారు. అక్కడితో ఆగక పెద్ద పెద్ద కేకలు వేశారు. మరుచటి రోజు అంటే ఆరో తేదీన ఉదయం పదిన్నర గంటల సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి.. బంగారం వ్యాపారికి ఫోన్ చేసి.. తాను జార్ఖండ్ మావోయిస్టు కమాండర్ దళం సభ్యుడిని అని.. తనకు అర్జెంటుగా 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ డబ్బులు ఇవ్వకపోతే కుటుంబ సభ్యులు చంపుతామని, తరువాత తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి ఉంటుందని బెదిరించాడు. అదే రోజు రాత్రి 7.30 గంటల సమయంలో మరోసారి ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో ఆ బంగారం వ్యాపారి భయపడి పార్వతీపురం పోలీసులను ఆశ్రయించాడు.

  ఈ కేసును తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ ఈ కేసును ఛేధించేందుకు ఓఎస్డీ ఎన్. సూర్యచంద్రరావు, పార్వతీపురం డిఎస్పీ సుభాష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలును ఏర్పాటు చేశారు. బంగారు వ్యాపారికి వచ్చిన ఫోన్ కాల్స్ పై నిఘా పెట్టారు. మార్చి 11,13,15,17న వరుసగా ఫోన్ చేసిన ఆర్మీ జవాను.. 5 కోట్ల రూపాయల నగదును ఇవ్వాల్సిందిగా బెదిరింపులకు దిగాడు. మార్చి 17న నిందితుడు ఫోన్ చేసి మరోసారి డబ్బులు డిమాండ్ చేస్తే.. పోలీసులు సూచన ప్రకారం తాను 5 కోట్లు ఇవ్వలేని.. కోటిన్నర వరకు ఇచ్చుకోగలను అని చెప్పాడు. అందుకు సరే అన్న నిందితుడు వెంటనే నగదు సిద్ధం చేసుకోవాలని.. ఆ డబ్బును ఎక్కడ ఇవ్వాలన్నది చెబుతానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. మళ్లీ ఈ నెల 21 ఉదయం నిందితుడు కోటిన్నర నగదును తీసుకుని విక్రంపురం-డంగభద్ర గ్రామాల మద్యలోని కొండ ప్రాంతానికి రావాల్సిందిగా  చెప్పాడు. అప్పటికే ఆ ఫోన్ కాల్స్ పై నిఘా పెట్టిన పోలీసులు పోలీసు బృందం పక్కా ప్రణాళికతో నిందితుడ్ని పట్టుకొనేందుకు అదే ప్రాంతంలో మాటు వేశారు. ఆ డబ్బుల బ్యాగు తీసుకొని వెళ్ళేందుకు నిందితుడు బయటకు రాగానే పోలీసుల బృందం అదుపులోకి తీసుకుంది. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో విచారిస్తే అసలు విషయం చెప్పాడు. తన పేరు చందనాపల్లి రాజేవ్వరరావు అని, తనది పార్వతీపురం మండలం బంటువానివలస గ్రామమని చెప్పాడు. 2012 నుండి తాను భారత సైన్యంలో పని చేస్తున్నట్లు, 45 రోజులు సెలవుపై స్వగ్రామంకు జనవరి 24న సొంత ఊరికి వచ్చినట్టు  తెలిపారు. ప్రస్తుతం తాను ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బరేల్లలో విధులు నిర్వహిస్తున్నట్లుగా తెలిపాడు. అయితే తాను ఒక స్థలం కొనుగోలు విషయంలో సుమారు 22 లక్షలు నష్టపోయానని. దీంతో తాను తిరిగి డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో ఈ తరహా దారిని ఎంచుకున్నానని చెప్పా డు. మూడు నెలల కిందట నుండి ప్రణాళిక రూపొందిస్తున్నట్లుగా అంగీకరించారు. ఇందులో భాగంగా తాను ఇంటికి వచ్చే ముందు ఉత్తర ప్రదేశ్ లో 30 వేల రూపాయలకు కంట్రీ మేడ్ పిస్టల్ ను కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నాడు. పార్వతీపురంలో బంగారం వ్యాపారిని బెదిరించి, డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకున్న తరువాత.. ఆ ఇంటిపై రెక్కీ నిర్వహించినన్నాడు. వ్యాపారిని బెదిరించేందుకు ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ఫోను అవసరంగా భావించి, తాను మార్చి 3న అలమండ ప్రాంతంలో సాయంత్రం.. సైకిళ్లపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను బెదిరించి వారి నుండి మొబైలు ఫోనులు తీసుకున్నాని.. ఆ ఫోన్ ల నుంచి బెదిరించినట్టు ఒప్పుకున్నాడు. తనని మావోయిస్టు పార్టీకి చెందిన కమాండరుగా నమ్మించేందుకే బాధితుడి ఇంటి కాంపౌండు వాల్ దూకి, ఇంటి పై మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు అంగీకరించాడు. నాలుగో రౌండు పిస్టల్ లో స్టాక్ అయిపోవడంతో అక్కడి నుంచి.. డబ్బులు పొందేందుకే మావోయిస్టు పేరుతో వ్యాపారి ఇందుపూరు చిన గుంప స్వామిని బెదిరించాను అని పోలీసుల విచారణ ఒప్పుకున్నట్టు జిల్లా ఎస్పీ రాజకుమారి చెప్పారు.

  ఈ మొత్తం ప్లాన్ ను బాలీవుడ్ వెబె సిరీస్ మీర్జాపూర్‌ను ఇన్సిపిరేషన్‌గా తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడి రాజేశ్వర రావు నుంచి చెక్క పిడి కలిగి, స్టీలుతో తయారు చేసిన దేశీయ పిస్టల్, మేగ్జిన్, 7.65 మి.మీ.ల 4 రౌండ్సు, లావ కంపెనీ మొబైల్ ఫోను, ఇన్ ఫీనిక్స్ స్కై బ్లూ ఆండ్రాయిడ్ ఫోను, రియల్ మీ ఆండ్రాయిడ్ ఫోను, డిపి కంపెనీ ఎల్ ఈడి టార్చిలైటు, ఇతర సామాన్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే వైటు పేపర్లుతో కూడిన నకిలీ కరెన్సీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ తరహా బెదిరింపులకు పాల్పడడం సీరియల్స్, సినిమాల్లో చూడడానికి బాగుంటాయని, నిజ జీవితంలో ఈ విధంగా బెదిరింపులుకు పాల్పడితే చట్టం దృష్టిలో దోషులుగా మిగలక తప్పదని జిల్లా ఎస్పీ అన్నారు. ఈ కేసులో క్రియాశీలకంగా వ్యవహరించి, నిందితుడ్ని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పార్వతీపురం డిఎస్పీ ఎ.సుభాష్, పార్వతీపురం సిఐ సిహెచ్.లక్ష్మణరావు, పార్వతీపురం పట్టన ఎస్ఐ జి.కళాధర్ ఇతర పోలీసులు సిబ్బందిని ఎస్పీ కొనియాడారు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime, Crime news, Soldier, Visakhapatnam, Vizag, Vizianagaram

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు