ప్రణయ్ మళ్లీ పుట్టాడు... పెళ్లి రోజే మగ బిడ్డకు జన్మనిచ్చిన అమృత...

మిర్యాలగూడలో పరువు హత్యను మనం ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అమృత మగ బిడ్డకు జన్మనిచ్చింది.

news18-telugu
Updated: February 2, 2019, 1:19 PM IST
ప్రణయ్ మళ్లీ పుట్టాడు... పెళ్లి రోజే మగ బిడ్డకు జన్మనిచ్చిన అమృత...
అమృత ప్రణయ్ ఫైల్ ఫొటో
  • Share this:
గత ఏడాది మిర్యాలగూడలో ప్రణయ్ హత్య సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రణయ్, అమృతలపై కక్ష పెంచుకొని... ఆమె తండ్రి మారుతీరావే కిరాయి హంతకులతో దారుణంగా ప్రణయ్‌ని హత్య చేయించాడు. ఆ సమయంలో 5 నెలల ప్రెగ్నెంట్ అయిన అమృత... ఇప్పుడు హైదరాబాద్‌లోని ఫెర్నాండేజ్ ఆస్పత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. దాంతో ప్రణయ్ ఇంట సంతోషాలు వెల్లివిరిశాయి. చనిపోయిన ప్రణయే... పిల్లాడి రూపంలో మళ్లీ జన్మించాడని ఇంటిల్లిపాదీ సంబరాలు చేసుకుంటున్నారు. సరిగా ప్రణయ్, అమృతల పెళ్లిరోజునే వారికి బిడ్డ పుట్టడం విశేషం. తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో... అమృత తండ్రి మారుతీరావు... ప్రణయ్‌ని అత్యంత దారుణంగా నడి రోడ్డుపై హత్య చేయించడమే కాదు... తానే చంపించినట్లు మీడియా, పోలీసుల ముందు ఏమాత్రం పాపభీతి లేకుండా ప్రకటించాడు.


రియల్ట్ అయిన ఆయన... ఐదేళ్లలో వందల కోట్ల ఆస్తులు సంపాదించి... అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఆ డబ్బు వల్లే మానవత్వాన్ని మరచిపోయిన ఆయన... హత్య చేయించారని అప్పట్లో తీవ్రమైన ఆందోళనలు జరిగాయి. ప్రణయ్ హత్య జరిగిన నాటి నుంచి... అమృత, ఆమె కుటుంబసభ్యులకు పోలీసులు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నారు. హత్యారోపణలు ఎదుర్కొంటున్న మారుతీరావు జైలు జీవితం గడుపుతున్నాడు.
telugu news, amrutha, amruta, pranay, boy, pranay murder, miryalaguda murder, honour killing, అమృత, ప్రణయ్, మారుతీరావు
అమృత ప్రణయ్ ఫైల్ ఫొటో


పెళ్లి రోజే అమృతకు బిడ్డ పుట్టడంతో కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంచలనం క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే అమృతకు సిజేరియన్ చేసి, ఆకస్మిక డెలివరీ చేశారని కొందరు ఆరోపిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం కూడా అమృతకు అబ్బాయి పుట్టినట్టు కొన్ని పుకార్లు హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే.
Video:ప్రణయ్ హత్య సీసీటీవి ఫుటేజీ..
First published: January 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>