KTR on Saidabad Rape Case: తెలంగాణ (Telangana)వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్ (saidabad)చిన్నారీ అత్యాచారం(rape) కేసులో నిందితుడు ఆచూకీ ఇంకా చిక్కకపోవడం ఉత్కంఠకు దారితీస్తుంది. అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పట్టుకుని ఎన్కౌంటర్ (Encounter)చేయాలంటూ అనేక మంది డిమాండ్ చేస్తుండగా.. మరోవైపు పోలీసులకు మాత్రం అత్యాచార నిందితుడు చుక్కలు చూపిస్తున్నాడు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. సైదాబాద్ (Saidabad) చిన్నారి (girl)ని పొట్టన పెట్టుకున్న నిందితుడు రాజు ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నిందితుడి జాడ కోసం వేట మొదలుపెట్టారు. ఎక్కడికక్కడ నాకా బందీలతో చెక్ చేస్తున్నారు. అయితే నిందితుడు చాకచక్యంగా తప్పించుకున్నాడు. దీంతో నిందితుడి పై రివార్డు (Reward) ప్రకటించింది హైదరాబాద్ పోలీస్ శాఖ. రాజు ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షలు ఇస్తామంటూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ (Hyderabad Police commissioner Anjani Kumar) రివార్డు ప్రకటించారు. ఆరేళ్ల చిన్నారి (Minor girl)పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కేసుపై కీలక సమీక్ష నిర్వహించారు పోలీసు ఉన్నతాధికారులు.
మరోవైపు సైదాబాద్ ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనలో నిందితుడు పట్టుబడ్టట్టు గతంలో తాను చేసిన ట్వీట్‌ను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఉపసంహరించుకున్నారు. తప్పుడు సమాచారం వల్ల ఈ ప్రకటన చేశానని మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. సమాచారలోపంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్టు పొరపాటున తాను ట్విట్ చేశానని తెలిపారు. నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు. నిందితుడిని పట్టుకునేందుకు అందరూ సహకరించాలని కోరారు. నిందితుడు త్వరగా అరెస్టయి, తగిన శిక్షపడటం ద్వారా బాధితులకు త్వరగా న్యాయం జరగాలని కోరుకుందామని మంత్రి కేటీఆర్ ట్విట్లో ఆకాంక్షించారు. కాగా.. ఈ ఘటన అనంతరం నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: వచ్చేస్తోంది కొత్త మినీ ఐప్యాడ్.. ఇకపై అందరికీ అందుబాటులో.. ధర ఎంతో తెలుసా...
మొత్తం పది బృందాలతో నాలుగు రోజులుగా గాలిస్తున్నా.. నిందితుడు రాజు అచూకి మాత్రం లభించడం కష్టంగా మారింది. ఎందుకంటే గంజాయి పీల్చడం , గుడుంబా తాగడం లాంటీ వాటితో రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడనే సమాచారాన్ని సేకరించారు.
మరోవైపు నిందితుడు రాజు సెల్‌ఫోన్ వాడకపోవడంతో ఎక్కడ ఉన్నాడనే ఆచూకి లభించడం కష్టంగా మారినట్టు పోలీసులు చెబుతున్నారు. సీసీ ఫుటేజీని పరిశీలించి , టెక్నికల్ సపోర్ట్‌తో నిందితున్ని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఇక నిందితుడు పారిపోయోందుకు సహకరించిన స్నేహితుడిని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, KTR, Minor girl, Minor girl raped, Telangana