తెలంగాణలోబాలికపై ఇద్దరి అత్యాచారం... గర్భం దాల్చడంతో అబార్షన్

అయితే నిందితుల తల్లిదండ్రులు ఎవరికీ తెలియకుండా చాలా తెలివిగా బాలికకు గర్భస్రావం చేయించారు. Asifabad Jainur FOXO Act police

news18-telugu
Updated: December 17, 2019, 2:26 PM IST
తెలంగాణలోబాలికపై ఇద్దరి అత్యాచారం... గర్భం దాల్చడంతో అబార్షన్
అయితే నిందితుల తల్లిదండ్రులు ఎవరికీ తెలియకుండా చాలా తెలివిగా బాలికకు గర్భస్రావం చేయించారు. Asifabad Jainur FOXO Act police
  • Share this:


అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడినవారికి కఠిన శిక్ష అమలు చేస్తామని.. ఓ వైపు ప్రభుత్వాలు  చట్టాలు చేేస్తుంటే.. మరోవైపు నేరాలు మాత్రం ఆగడం లేదు. ఎక్కడికక్కడఆడవారిపై వయసుతో తేడా లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ అమ్మాయి గర్భం దాల్చడంతో యువకులు తల్లిదండ్రులు షాక్ తిన్నారు. ఈ విషయం తెలియగానే ఆ అమ్మాయిని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. గుట్టు చప్పుడు కాకుండా బాలికకు అబార్షన్ చేయించారు. ఆ అమ్మాయి ఆరోగ్యం ఏమవుతుంది... ఇలా చేయడం తప్పుకదా అని వాళ్లు ఏ మాత్రం ఆలోచించలేదు. వాళ్ల పిల్లలు చేసిన నేరాన్ని కప్పిపుచ్చేందుకు ఎవరికీ తెలియకుండా చాలా తెలివిగా బాలికకు గర్భస్రావం చేయించారు. అయితే చేసిన పాపం ఊరికి పోదన్నట్లు... ఈ విషయం కాస్త బాలిక నాయనమ్మకు తెలిసింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరు యువకులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటన తెలంగాణలో కొమ్రంభీ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌లో చోటు చేసుకుంది.

 
 
First published: December 17, 2019, 2:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading