హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking : బాలికపై ఫ్యాక్టరీ మేనేజర్ అత్యాచారం..నోట్లో యాసిడ్ పోసి మరీ..

Shocking : బాలికపై ఫ్యాక్టరీ మేనేజర్ అత్యాచారం..నోట్లో యాసిడ్ పోసి మరీ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rape on minor : కామాంధులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ఎన్ని చట్టాలు చేసినా,ఎన్ని కఠిన శిక్షలు వేసినా మృగాళ్లలో మాత్రం మార్పు రావట్లేదు. తప్పు చేస్తే పోలీసులు అరెస్ట్‌ చేస్తారని, కోర్టులు శిక్షిస్తాయనే ఆలోచనే లేనట్లు వ్యవహరిస్తున్నారు.

ఇంకా చదవండి ...

Rape on minor : కామాంధులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ఎన్ని చట్టాలు చేసినా,ఎన్ని కఠిన శిక్షలు వేసినా మృగాళ్లలో మాత్రం మార్పు రావట్లేదు. తప్పు చేస్తే పోలీసులు అరెస్ట్‌ చేస్తారని, కోర్టులు శిక్షిస్తాయనే ఆలోచనే లేనట్లు వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా మరో దారణ ఘటన దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో వెలుగుచూసింది. ఓ మైనర్​పై అత్యాచారం(Rape on minor) చేసి ఆపై బలవంతంగా నోట్లో యాసిడ్​ పోశాడు కిరాతకుడు. బాధితురాలిని హాస్పిటల్ తరలించగా.. ప్రస్తుతం ఆరోగ్యం విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

ఢిల్లీలో నివసించే 15ఏళ్ల బాధితురాలి కుటుంబం రోజువారీ కూలీ చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే షూ పరిశ్రమలో పనిచేసేందుకు బాధితురాలు వెళ్లింది. అయితే జూన్ 5వ తేదీన తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి నమ్మించిన ఫ్యాక్టరీ మేనేజర్​ జై ప్రకాశ్(31)​..బాలికను ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు తప్పాంచుకొని ఇంటికి వెళుతుండగా ప్రకాశ్ ఆమెను ఆపి ఆమె నోటిలో యాసిడ్ లాంటి ద్రవాన్ని పోశాడు. ఇంటికి చేరిన తర్వాత, ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. కుటుంబసభ్యులు బాలికను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో చేర్పించారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఔటర్) సమీర్ శర్మ తెలిపారు. శనివారం ఓ ఎన్జీవో మెంబర్ సమక్షంలో బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు తెలిపారు. నంగ్లోయ్ పోలీస్ స్టేషన్‌లో IPC, POCSO చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Islam in china : మా దగ్గర మాలానే ఉండాలి..చైనాలో ఇస్లాం మతంపై జిన్ పింగ్ కీలక వ్యాఖ్యలు

మరోవైపు ఢిల్లీ మహిళా కమిషన్ ఈ వ్యవహారంపై పోలీసులకు నోటీసులు జారీ చేసింది. 15 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్యాయత్నంపై ఫిర్యాదు అందినట్లు కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. తమ బృందం అమ్మాయి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని, బాధితురాలకి,ఆమె కుటుంబానికి అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తోంది అని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్శన్ స్వాతి మలివాల్ ప్రకటనలో తెలిపారు.

First published:

Tags: Delhi, Minor girl raped

ఉత్తమ కథలు