రేప్ చేసిన వాడితో పరారీ.. ఫ్యామిలీకి విషం పెట్టి...

విచిత్రమైన విషయం ఏంటంటే.. ఏ యువకుడితో అయితే, ఆ యువతి పారిపోయిందే.. అతడు ఆమె మీద అత్యాచారం చేశాడు.

news18-telugu
Updated: September 12, 2019, 3:09 PM IST
రేప్ చేసిన వాడితో పరారీ.. ఫ్యామిలీకి విషం పెట్టి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ యువతి తన ఇంట్లో వారికి విషం పెట్టి ఓ యువకుడితో పారిపోయింది. ఈ ఘటనలో ఆ కుటుంబానికి చెందిన ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. యూపీలోని మొరాదాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆ యువతి ఇంట్లో నుంచి పారిపోయే సమయంలో ఇంట్లో ఉన్న ఆహారంలో విషం కలిపింది. ఆ ఆహారం తిన్న అమ్మ ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరిలు, వదిన, మేనల్లుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులతో ఇబ్బంది పడుతున్న వారిని చూసి ఇరుగుపొరుగు వారు ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరు మినహా మిగిలిన వారు డిశ్చార్జ్ అయినట్టు పోలీసులు తెలిపారు. ఇందులో విచిత్రమైన విషయం ఏంటంటే.. ఏ యువకుడితో అయితే, ఆ యువతి పారిపోయిందే.. అతడు ఆమె మీద అత్యాచారం చేశాడు. ఆ కేసులో కొన్ని రోజుల నుంచి జైల్లో ఉన్నాడు. బెయిల్ మీద వచ్చిన తర్వాత ఆమెను తీసుకుని పారిపోయాడు. వెళ్తూ వెళ్తూ తన కుటుంబం మొత్తాన్ని చంపడానికి ఆ యువతి ప్లాన్ వేసింది. ఇద్దరూ కలసి పారిపోతూ ఈ దారుణానికి ఒడిగట్టారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఆ యువతి మైనర్ కావడంతో నిందితుడి మీద కిడ్నాప్ కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

First published: September 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>