Home /News /crime /

MINOR LOVERS COMMIT SUICIDE IN PEDDAPALLI AFTER ADULTS REJECT THEIR LOVE MARRIAGE AND RELATIONSHIP PRV

Minor lovers: ప్రేమించుకున్నారు.. బాసలు చేసుకున్నారు.. పెళ్లి చేసుకుందామంటే ఒక్కటే సమస్య.. ఇక అంతే చేయకూడని పని చేశారు..

శివ, సుష్మిత (ఫైల్​ ఫొటో)

శివ, సుష్మిత (ఫైల్​ ఫొటో)

ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. వారి ప్రేమకు విధి అడ్డు తగిలింది.  క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది.

    ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి (marriage)చేసుకుందామని చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. వారి ప్రేమకు విధి అడ్డు తగిలింది.  దీంతో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. పెద్దలు కుదరదన్నారు. అంతే క్షణమైన ఆలోచించకుండా ప్రాణాలు తీసుకున్నారు (Lovers suicide).పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ ప్రేమ జంట (Minor lovers) వారి కులాలు వేరు కావడం వల్ల పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు.

    ఊరంతా తెలియడంతో..

    సుల్తానాబాద్ (Sultanabad) మండలం కనుకుల గ్రామంలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. కనుకులలో శివ, సుస్మిత అనే ఇద్దరు మైనర్లు (Minors) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఊరంతా తెలిసింది. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు ఇద్దరు ప్రేమికులను మందలించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి వారి కులాలు వేరు కావడం, ఇద్దరు ప్రేమికులు మైనర్లు కావడంతో పెండ్లి చేయలేమని తేల్చి చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన ప్రేమ జంట చావే మార్గమని నిశ్చయించుకొని నిన్న ప్రియుడు శివ పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ కరీంనగర్ ఆస్పత్రిలో మృత్యువాత పడ్డాడు.

    గతంలో పోలీసుల కౌన్సెలింగ్​..

    అయితే ప్రియుడు శివ (Shiva) చనిపోయాడని తెలుసుకుని ప్రియురాలు సుస్మిత. మనస్తాపం చెందింది.  నేడు తెల్లవారుజామున గ్రామంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు (Suicide) పాల్పడింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన ఇరు కుటుంబాలు పోలీసులను ఆశ్రయించడంతో ప్రేమ జంటకు కౌన్సిలింగ్ ఇచ్చి నట్టు తెలిసింది. మృతి చెందిన ప్రేమికుల ఫైల్ ఫోటోలతో వీడియో తయారు చేసి గ్రామస్తులు సోషల్ మీడియా గ్రూప్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో కూడా ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఇటీవలె ఇలాంటి ఘటనే ఏపీలో జరిగింది.

    మైనర్ కావడంతో..

    బొబ్బిలికి చెందిన 20 ఏళ్ల రాకేష్ అనే యువకుడు.. కురుపాంకు చెందిన 16 ఏళ్ల మైనర్ యువతి ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే అమ్మాయి మైనర్ కావడంతో పెళ్లి జరగదనుకుని భయపడ్డారు. ఇంతలో ఓ మూడోవ్యక్తి వీరి ప్రేమ వ్యవహారంలో తలదూర్చాడు. అతడు ప్రేమజంటను ఇబ్బందులకు గురిచేస్తుండటం, బెదిరింపులకు దిగడంతో తమ పెళ్లి ఇక జరగదేమోనని తీవ్ర మనస్థాపం చెందారు.

    సోమవారం మధ్యాహ్నం ఇద్దరు తోటపల్లి బ్యారేజ్ వద్దకు చేరుకున్నారు. చివరిసారిగా ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేశారు. తమ చావుకు మౌళి అనే వ్యక్తి కారణమని చెప్పుకొచ్చారు. తమ ప్రేమ వ్యవహారాన్ని సైతం తెలిపారు.  ఎలాగూ కలిసి బతకలేమని కలిసైనా చనిపోదామని అనుకుంటున్నట్లు తెలిపారు. చివరికి బ్యారేజ్ పై చెప్పులు విడిచి, రెండు మాస్కులు, బైక్, సెల్ ఫోన్ లు కూడా అక్కడే వదిలేసి బ్యారేజ్ లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు విడవకుండా చున్నీతో గట్టిగా కట్టుకున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Lovers suicide, Minor girl, Peddapalli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు