నీళ్ల కోసం వెళ్తే గదిలోకి తీసుకెళ్లి.. బాలికపై వాటర్ ట్యాంకర్ డ్రైవర్ రేప్..

ఇటీవల బాలిక ఓరోజు నీళ్ల కోసం ట్యాంకర్ వద్దకు వెళ్లగా.. మాయ మాటలతో రవి ఆమెను తనతో పాటు ఓ గదికి తీసుకెళ్లాడు.అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

news18-telugu
Updated: September 13, 2019, 8:18 AM IST
నీళ్ల కోసం వెళ్తే గదిలోకి తీసుకెళ్లి.. బాలికపై వాటర్ ట్యాంకర్ డ్రైవర్ రేప్..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 13, 2019, 8:18 AM IST
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో దారుణం జరిగింది. 15 ఏళ్ల బాలికపై ఓ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు.బాధితురాలి ఫిర్యాదు మేరకు గురువారం పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. స్నేహం పేరుతో అతను బాలికకు దగ్గరై ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే.. బతుకుదెరువు నిమిత్తం ఓ కుటుంబం ఆర్నెళ్ల క్రితం మాదాపూర్ వచ్చి స్థిరపడింది. ఆ కుటుంబానికి చెందిన బాలిక(15) మంచినీటి కోసం సమీపంలోని వాటర్ ట్యాంకర్ వద్దకు తరుచూ వెళ్లేది. అలా వాటర్ ట్యాంకర్ డ్రైవర్ రవి(24)తో పరిచయమైంది. ఇటీవల బాలిక ఓరోజు నీళ్ల కోసం ట్యాంకర్ వద్దకు వెళ్లగా.. మాయ మాటలతో రవి ఆమెను తనతో పాటు ఓ గదికి తీసుకెళ్లాడు.అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటికెళ్లాక జరిగిన విషయాన్ని బాలిక తల్లితో చెప్పింది. ఆపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


First published: September 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...