బాలికతో రాత్రికి రాత్రే పెళ్లి... పొద్దున్న లేచి ఏం చేశాడంటే ?

ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. అమ్మాయి కాలేజీ దగ్గర చక్కర్ల కొట్టాడు. అమ్మాయిని నెమ్మదిగా తన మాటల్లో దింపి పెళ్లి చేసుకుందామని నమ్మించాడు.

news18-telugu
Updated: October 12, 2019, 8:28 AM IST
బాలికతో రాత్రికి రాత్రే పెళ్లి... పొద్దున్న లేచి ఏం చేశాడంటే ?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కొందరు యువకులు అభం శుభం తెలియని మైనర్ అమ్మాయిల్ని ముగ్గులోకి దింపుతున్నారు. నెమ్మదిగా నమ్మించి వంచిస్తున్నారు. గత కొన్నిరోజులుగా అనేకమంది అమ్మాయిలు... కొందరు కామాంధుల చేతికి చిక్కి నానా అవస్థలు పడ్డారు.తాజాగా శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకంది. బాలికను ఓ యువకుడు నమ్మించి రాత్రికిరాత్రే పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత పొద్దున్నే లేచి పత్తాలేకుండా పోయాడు.

శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలో ఓ గ్రామానికి చెందిన బాలిక ఇంటర్ సెకండీయ్ చదువుతోంది. అయిత అదే గ్రామానికి చెందని యువకుడు వెంకటేశ్‌ బాలికను ట్రాప్ చేశాడు. ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. అమ్మాయి కాలేజీ దగ్గర చక్కర్ల కొట్టాడు. అమ్మాయిని నమ్మించి పెళ్లి చేసుకుందామని నమ్మించాడు. నాలుగు నెలల తర్వాత అమ్మాయిని అమ్మవారి గుడికి తీసుకెళ్లి మెడలో తాళికట్టాడు. ఆ రాత్రి అక్కడే గడిపి ఉదయాన్ని బాలికను అక్కడే వదిలి పారిపోయాడు. దీంతో తాను మోసపోయానని భావించిన బాలిక... తల్లిదండ్రులతో కలిసి పోలీసుల్ని ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... ఇద్దరి తల్లిదండ్రుల్ని పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
First published: October 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading