బాలికపై అత్యాచారయత్నం... ప్రతిఘటించడంతో కాల్చి చంపేసిన కామాంధులు

ఇప్పటికే రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకొచ్చి నిందితుల్ని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

news18-telugu
Updated: December 18, 2019, 12:27 PM IST
బాలికపై అత్యాచారయత్నం... ప్రతిఘటించడంతో కాల్చి చంపేసిన కామాంధులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బీహార్‌లో కామాంధులు రెచ్చిపోయారు. ఓ బాలికపై నలుగురు మృగాలు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. బాలిక వారికి ఎదురు తిరిగింది. దీంతో ఆ అమ్మాయిపై కాల్పులు జరిపారు కామాంధులు. తమను ఎదిరించినందుకు కాల్పి చంపేశారు. బీహార్‌లోని రొహ్‌తక్‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసలుు ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనపై నితీష్ సర్కార్‌పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని బీహార్ ప్రజలు మండిపోతున్నారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ఇటు ప్రతిపక్షాలు కూడా బీహార్ సర్కార్‌ను నిలదీస్తున్నాయి. ఈఘటనకు ముందు ఇలాంటి తరహా ఘటనే కొన్నిరోజుల క్రితం బీహార్‌లో చోటు చేసుకుంది. ఇందులో అత్యాచారం చేస్తున్న వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ 23 ఏళ్ల యువతిని నిందితులు సజీవంగా దహనం చేశారు. ఈ దుర్ఘటనలో తీవ్రగాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో పదిరోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణం విడిచింది.
Published by: Sulthana Begum Shaik
First published: December 18, 2019, 12:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading