చిత్తూరు జిల్లాలో బాలికపై యువకుడి అత్యాచారం..

ఏపీలో చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కలికిరి మండలం కొట్టాల గ్రామంలో పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు.

news18-telugu
Updated: November 27, 2019, 11:50 AM IST
చిత్తూరు జిల్లాలో బాలికపై యువకుడి అత్యాచారం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కలికిరి మండలం కొట్టాల గ్రామంలో పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. చిన్న బాలిక అని కూడా చూడకుండా ఆమెపై క్రూరంగా ప్రవర్తించాడు. వీరభద్రయ్య(25) అనే నీచుడు.. గ్రామానికి చెందిన బాలికపై రేప్ చేశాడు. దీంతో బాధిత బాలిక బంధువులు, స్థానికులు అతడ్ని పట్టుకొని చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చి, వాళ్లకు అప్పగించారు. అయితే.. నిందితుడు పోలీసుల చెర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. తప్పించుకోబోతుండగా పట్టుకొని తమ లాఠీలకు పనిచెప్పారు. రోడ్డుపైనే దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోస్కో చట్టం కింద కేసు పెట్టారు.

కాగా, బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఆ కామాంధుడిని ఉరి తీయాలని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అదే సరైన శాస్తి అంటూ పాఠశాలల బాలికలు, ప్రజాసంఘాలు ర్యాలీ చేపట్టాయి.
Published by: Shravan Kumar Bommakanti
First published: November 27, 2019, 11:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading