తెలంగాణలో మరో దారుణం చోటుచేసుకుంది. కుమ్రం భీం జిల్లా జైనూరు మండలం షేక్‌గూడకు చెందిన బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో మరో దారుణం చోటుచేసుకుంది. బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఎవ్వరికీ తెలీకుండా ఆమెకు గర్భస్రావం చేయించారు. ప్రభు, శ్రీకాంత్ అనే ఇద్దరు యువకులు గ్రామానికి చెందిన బాలికపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. కొన్ని రోజులకు గర్భం దాల్చడంతో ఆమెను తీసుకెళ్లి గర్భస్రావం చేయించారు. ఈ విషయం తెలిసిన బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. నిందితులపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Disha, Telangana