తల్లి స్నేహితులే కదా అని ఇంట్లోకి రానిస్తే...బాలికను రేప్ చేసి...దారుణం...

రెండు నెలల క్రితం మహిళ తన ఉద్యోగం పని మీద ఆఫీసులో ఉండగా, ఆమె సహచర ఉద్యోగులు మహిళ కుమార్తెపై కన్నేశారు. బాలిక ఇంట్లోనే ఒంటరిగా ఉందని గమనించి బాలికపై అత్యాచారం చేయాలని నిశ్చయించుకున్నారు.

news18-telugu
Updated: September 7, 2020, 10:47 AM IST
తల్లి స్నేహితులే కదా అని ఇంట్లోకి రానిస్తే...బాలికను రేప్ చేసి...దారుణం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అభం శుభం తెలియని మైనర్ బాలికపై ఆమె తల్లి సహచర ఉద్యోగులే అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది. నిందితుల్లో ఓ పోలీసు అధికారి ఉండటంతో ఈ కేసు సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే స్థానిక టీవీ చానెల్ లో పనిచేస్తున్నఓ మహిళ తన కుమార్తె(13)తో కలిసి భువనేశ్వర్‌లోని ఇన్ఫోసిటీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. కాగా రెండు నెలల క్రితం మహిళ తన ఉద్యోగం పని మీద ఆఫీసులో ఉండగా, ఆమె సహచర ఉద్యోగులు మహిళ కుమార్తెపై కన్నేశారు. బాలిక ఇంట్లోనే ఒంటరిగా ఉందని గమనించి బాలికపై అత్యాచారం చేయాలని నిశ్చయించుకున్నారు. ఓ పోలీసు అధికారితో కలిసి బాలిక ఇంట్లో దూరి అకృత్యానికి పాల్పడ్డారు. బయటకు చెబితే తల్లీ, కూతుళ్లను చంపేస్తానని బెదిరించారు. దీంతో ఆ బాలిక మౌనంగా భరించాల్సి వచ్చింది.

ఇదిలా ఉంటే బాలిక కొద్ది రోజులుగా అనారోగ్యం పాలవడంతో, ఆమె తల్లి ఆరా తీయగా, బాలిక భయపడుతూ జరిగిన సంగతి చెప్పింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద నిందితులను అరెస్టు చేశారు. విచారణ కొనసాగుతోంది. మిగితా నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Published by: Krishna Adithya
First published: September 7, 2020, 10:47 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading