పక్కింట్లో టీవీ చూసేందుకు వెళ్లి.. కామాంధుడి చేతిలో బలైన బాలిక

అప్పటికే బాలిక కోసం వెతుకుతున్న ఆమె తల్లిదండ్రులకు సుజన్‌పై అనుమానం వచ్చి.. బలవంతంగా ఇంట్లోకి వెళ్లి తనిఖీ చేశారు.ఇంట్లో ఒక మూలన బాలిక మృతదేహాన్ని కుక్కిన సంచి కనిపించింది.

news18-telugu
Updated: September 15, 2019, 10:36 AM IST
పక్కింట్లో టీవీ చూసేందుకు వెళ్లి.. కామాంధుడి చేతిలో బలైన బాలిక
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 15, 2019, 10:36 AM IST
పశ్చిమ బెంగాల్‌లోని ఓ మురికివాడలో దారుణం జరిగింది. టీవీ చూసేందుకు ఇంటికొచ్చిన ఓ మైనర్ బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. అత్యాచారం అనంతరం దారుణంగా హతమార్చి ఒక సంచిలో కుక్కేశాడు. అనుమానంతో మృతురాలి కుటుంబ సభ్యులు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించగా అసలు విషయం బయటపడింది.

వివరాల్లోకి వెళ్తే.. తూర్పు మిడ్నాపూర్‌లో ఉన్న హల్దియా టౌన్‌షిప్‌ సమీపంలోని ఓ మురికివాడలో సుజన్ అనే వ్యక్తి భార్య,కూతురితో కలిసి నివసిస్తున్నాడు. ఇటీవలే అతని కూతురికి పెళ్లయింది. సుజన్ ఇంటి పక్కనే ఉండే శాంతి అనే మైనర్ బాలిక.. టీవీ చూసేందుకు తరుచూ వాళ్ల ఇంటికి వెళ్లేది. ఇదే క్రమంలో శుక్రవారం సాయంత్రం కూడా వాళ్ల ఇంట్లో టీవీ చూసేందుకు వెళ్లింది. ఆరోజు సుజన్ భార్య ఇంట్లో లేకపోవడంతో అతనొక్కడే ఉన్నాడు. ఇదే అదనుగా భావించి టీవీ చూసేందుకు వచ్చిన శాంతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

అనంతరం ఆమెను ఇంట్లోనే బంధించి బయటకు వెళ్లిపోయాడు. కాసేపటికి ఇంటికి తిరిగొచ్చి బాలికను తీవ్రంగా కొట్టి హతమార్చాడు.ఆపై ఓ గోనె సంచిలో ఆమె మృతదేహాన్ని కుక్కేశాడు. అప్పటికే బాలిక కోసం వెతుకుతున్న ఆమె తల్లిదండ్రులకు సుజన్‌పై అనుమానం వచ్చి.. బలవంతంగా ఇంట్లోకి వెళ్లి తనిఖీ చేశారు.ఇంట్లో ఒక మూలన బాలిక మృతదేహాన్ని కుక్కిన సంచి కనిపించింది. దీంతో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

First published: September 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...