బాలికపై అత్యాచారం... ఆపై పెళ్లి చేసుకొని

విజయవాడ గొల్లపూడికి చెందిన ఓ బాలిక ఇంటర్మీడియట్‌ చదువుతోంది. ఆమెకు గుంటూరు కాకుమానువారితోటకు చెందిన రసూల్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు.

news18-telugu
Updated: October 8, 2019, 11:27 AM IST
బాలికపై అత్యాచారం... ఆపై పెళ్లి చేసుకొని
నమూనా చిత్రం
  • Share this:
బాలికకు మాయమాటలు చెప్పి ఓ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందు, ఆ తర్వాత కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో అతనిపై గుంటూరు అరండల్‌పేట ఠాణాలో కేసు నమోదైంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం విజయవాడ గొల్లపూడికి చెందిన ఓ బాలిక ఇంటర్మీడియట్‌ చదువుతోంది. ఆమెకు గుంటూరు కాకుమానువారితోటకు చెందిన రసూల్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందు, తర్వాత అత్యాచారం బాలికపై అత్యాచారం జరిపాడు. దీంతో విజయవాడ భవానీపురం ఠాణాలో బాలిక తండ్రి కిడ్నాప్‌ కేసు పెట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసును గుంటూరు అరండల్‌పేట పోలీసులకు అప్పగించారు. పోలీసులు బాలిక స్టేట్‌మెంట్‌ రికార్డు చేసుకుని రసూల్‌పై కేసు నమోదు చేశారు.

First published: October 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు