తెలంగాణలో మరో దారుణం... బాలికపై అత్యాచారం ఆపై ఉరి

రాత్రి బాలికను పొలాల్లోకి రమ్మని ఆగంతకుడు ఫోన్ చేశాడు. వాడి మాటల్ని అమాయకంగా నమ్మి వెళ్లిన బాలికపై అక్కడే అత్యాచారానికి పాల్పడ్డాడు.

news18-telugu
Updated: December 3, 2019, 9:41 AM IST
తెలంగాణలో మరో దారుణం... బాలికపై అత్యాచారం ఆపై ఉరి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
షాద్‌నగర్ దిశా హత్యాచార ఘటనపై ఓ వైపు నిరసనలు జరుగుతుంటేనే... మరోవైపు దేశవ్యాప్తంగా అమ్మాయిలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. నిన్నరాజస్థాన్‌లో మూడేళ్ల చిన్నారిని రేప్ చేసి స్కూల్ బెల్ట్‌తో ఉరితీసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. తెలంగాణలో కూడ మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాలికను రేప్ చేసి ఆపై ఉరితీసి చంపేశారు కిరాతకులు. గద్వాల్ జిల్లా మల్డకల్ మండలం నేతివానిపల్లిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

రాత్రి బాలికను పొలాల్లోకి రమ్మని ఆగంతకుడు ఫోన్ చేశాడు. వాడి మాటల్ని అమాయకంగా నమ్మి వెళ్లిన బాలికను అక్కడే అత్యాచారం చేశారు. ఆపై అమ్మాయిని ఉరివేసి హతమార్చారు. దీంతో ఈ ఘటనపై గ్రామంలో జనం భగ్గుమంటున్నారు. నిందితుల్ని ఒక్కరోజులు పట్టుకోకపోతే... పోరుబాట తప్పదని హెచ్చరిస్తున్నారు. గ్రామ ప్రజలకు దొరికితే గనుక గద్వాల్ జిల్లాలో సోమనాద్రి సాక్షిగా నడి రోడ్డు మీద చంపేస్తామని పోలీసులకు సవాలు విసురుతున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత పెంచారు.

First published: December 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>