ఆన్‌లైన్ పాఠాలు వినమని స్మార్ట్ ఫోన్ ఇస్తే.. ఇన్‌స్టాలో ప్రేమ పాఠాలు..

ప్రతీకాత్మక చిత్రం

ఓ బాలికకు తల్లిదండ్రులు ఆన్‌లైన్ క్లాసులు వినేందుకు తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ చేతికిచ్చారు. కానీ ఆ బాలిక పాఠాలకు బదులు సోషల్ మీడియాకు బానిసైపోయింది.

 • Share this:
  కరోనా మహమ్మారి రోజురోజూకీ విజృంభిస్తోంది. వైరస్ నియంత్రణకు విధించిన లాక్‌డౌన్ కారణంగా అన్నిరంగాలు స్థంభించిపోయాయి. ప్రధానంగా విద్యారంగంపై తీవ్ర ప్రభావం పడింది. పాఠశాలలు మూతపడడంతో విద్యార్థులు నష్టపోకుండా ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే విద్యార్థుల చేతికి స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. క్లాసులు వినే నేపథ్యంలో ఎక్కువ సమయం ఇంటర్ నెట్‌లోనే గడుపుతున్నారు. ఈ సమయంలో విద్యార్థులు పక్కదారి పడుతున్నారు. తాజాగా ఓ బాలికకు తల్లిదండ్రులు ఆన్‌లైన్ క్లాసులు వినేందుకు తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ చేతికిచ్చారు. కానీ ఆ బాలిక పాఠాలకు బదులు సోషల్ మీడియాకు బానిసైపోయింది. ఆ క్రమంలో ఓ వ్యక్తి మాయలో పడి అతడి దగ్గరికి వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు చేరింది.

  కానీ చివరి క్షణంలో బాలిక తండ్రి అప్రమత్తమవ్వడంతో సురక్షితంగా బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరు ఉత్తరహళ్లిలోని ఏజీఎస్ లేఅవుట్‌లోని ప్రైవేటు పాఠశాలలో ఓ బాలిక 8వ తరగతి చదువుతోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆన్‌లైన్ పాఠాలు నిర్వహిస్తుండడంతో ఇంటర్ నెట్, సోషల్ మీడియాకు బానిసైపోయింది.

  ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ సమయం గడుపుతూ హైదరాబాద్‌కు చెందిన విశాల్ అనే యువకుడితో పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలో విశాల్ బాలికతో నిన్ను వదిలి ఉండలేనని, హైదరాబాద్ వచ్చేయాలంటూ కోరాడు. అది నమ్మిన బాలిక జూన్ 8న మ్యూజిక్ క్లాసుకి వెళ్లాలంటూ ఇంటి నుంచి వెళ్లింది. నేరుగా కెంపేగౌడ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అయితే కొంతకాలంగా కూతురులో మార్పు గమనిస్తున్న తండ్రి ఎంతసేపటికీ కూతురు తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డీకోడ్ చేసి చాటింగ్ హిస్టరీ చూశాడు.

  చాటింగ్‌లో అసలు విషయం తెలుసుకున్నాడు. బాలిక హైదరాబాద్ వెళ్లేందుకు విశాల్ విమానం టికెట్ సైతం బుక్ చేసిన విషయం తెలుసుకున్నాడు. నేరుగా ఎయిర్ పోర్టుకు వెళ్లి కూతురును పట్టుకున్నాడు. అనంతరం ఈనెల 17న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
  First published: