Home /News /crime /

MINOR GIRL LOCKED THEIR FAMILY IN HOME OVER LOVE ISSUE MS

ప్రియుడు వచ్చేదాక అంతే.. కుటుంబాన్ని,పోలీసుల్ని ముప్పు తిప్పలు పెట్టిన బాలిక..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మైనర్ వివాహాలు నేరమంటూ పోలీసులు ఆమె కౌన్సెలింగ్ ఇచ్చారు. మైనారిటీ తీరేవరకు తిరుపతి జువైనల్ హోమ్‌కు తరలించాల్సిందిగా ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ అధికారులకు అప్పగించారు.

    ఆమె ఓ మైనర్ బాలిక.. ఏడాది క్రితం స్థానిక యువకుడితో ప్రేమలో పడింది. తెలిసీ తెలియని వయసులో ప్రేమ ఏంటని తల్లిదండ్రులు మందలించారు. అయినా బాలిక మారకపోవడంతో చదువు మానిపించి ఇంట్లోనే ఉంచారు. దీంతో తల్లిదండ్రులపై ఆమె కక్ష పెంచుకుంది. గురువారం వారిని ఇంట్లోని బెడ్రూమ్‌లో బంధించింది.
    ఆమె హాల్లోనే ఉండి.. లోపలి నుంచి గడియ పెట్టింది. గట్టిగా అరుస్తూ నానా హంగామా చేసింది. పోలీసులు వచ్చి నచ్చజెప్పినా వినిపించుకోలేదు. చివరకు ప్రియుడి తండ్రి వచ్చి నచ్చజెబితే గానీ ఆమె ఎవరి మాట వినలేదు. చిత్తూరు జిల్లా పలమనేరులో ఈ ఘటన జరిగింది.

    పలమనేరు పట్టణంలోని నాలుగురాళ్లు వీధిలో చాలాకాలంగా ఓ కుటుంబం నివాసం ఉంటోంది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్నమ్మాయి గతేడాది ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరింది. ఆ సమయంలో స్థానిక కొరియర్ బాయ్ రెహమాన్‌తో ప్రేమలో పడింది. ఆ క్రమంలో ఓసారి ఇంటి నుంచి పారిపోయింది. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రెహమాన్‌పై పోక్సో,కిడ్నాప్ కేసులు నమోదు చేసి.. ఎట్టకేలకు వారిని పట్టుకోగలిగారు. అప్పటినుంచి రెహమాన్ మళ్లీ ఆమె జోలికి రాలేదు. ప్రేమ వ్యవహారంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆమె చదువును మానిపించారు.

    ఇటీవల రెహమాన్ మళ్లీ ఆ వీధిలో తిరగడం మొదలుపెట్టాడు. దీంతో బాలిక అతను కావాలంటూ ఇంట్లోవాళ్లతో గొడవపడటం మొదలుపెట్టింది. గురువారం సాయంత్రం తల్లిని,అక్కను ఇంట్లోని బెడ్రూమ్‌లో బంధించింది. ఆపై తాను హాల్లోకి వచ్చి లోపలి నుంచి గడియ పెట్టుకుంది. పెద్దగా అరుస్తూ హంగామా చేసింది. పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా లాభం లేకపోయింది. ప్రియుడు వచ్చేదాకా బయటకు రానని తెగేసి చెప్పింది.చివరకు ఆమె ప్రియుడి తండ్రి అక్కడికి వచ్చి నచ్చజెప్పడంతో.. ఎట్టకేలకు ఆమె తలుపు తీసి బయటకొచ్చింది. మైనర్ వివాహాలు నేరమంటూ పోలీసులు ఆమె కౌన్సెలింగ్ ఇచ్చారు. మైనారిటీ తీరేవరకు తిరుపతి జువైనల్ హోమ్‌కు తరలించాల్సిందిగా ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ అధికారులకు అప్పగించారు.
    First published:

    Tags: Andhra Pradesh, Chittoor, Love affair

    తదుపరి వార్తలు