Kidnap Mystery: మైనర్ బాలిక కేసులో వీడని మిస్టరీ.., కన్నతల్లే ఆ పని చేయించిందా..?

Mystery continues in girl kidnap case in East Godawari

కిడ్నాప్ కు గురైన బాలిక సంయుక్త ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తల్లి వెంకటలక్ష్మి పైనే కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో కిడ్నాప్ కలకలం రేగింది. 12 ఏళ్ల మైనర్ బాలికను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కారులో వచ్చిన నలుగురు దుండగులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే... అయినవిల్లి మండలం శానపల్లిలంకలోని గుంట్రువారి పేటకు చెందిన గుర్రాల సంయుక్త(12) నాయనమ్మ, తాతయ్యల దగ్గర ఉంటోంది. సంయుక్త తల్లిదండ్రులు మనస్పర్ధకారణంగా విడిపోయారు. ఇద్దరూ విడివిడిగా ఉంటూ హైదరాబాద్ లో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల మధ్య గొడవల వల్ల అయినవల్లి పోలీస్ స్టేషన్లో పలు కేసులు కూడా నమోదయ్యాయి. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా ఇద్దరిలో మార్పురాలేదు. కూతురు సంయుక్త ఇష్ట్ర ప్రకారం గుంట్రువారిపేటలోని తండ్రి రవితేజ ఇంటి వద్దే ఉంటోంది. అప్పటినుండి బాలిక ఆలనా పాలన నాయనమ్మ మంగాదేవి చూసుకొంటుంది. ఈ నేపథ్యంలో బాలిక కిడ్నాప్ కు గురైంది.

    ఉదయం సంయుక్త తన స్నేహితులతో కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా అకస్మాత్తుగా ఒక నల్లకారు వచ్చి ఆగిందని.. అందులో నుంచి ఓ వ్యక్తి సంయుక్త చేయి పడ్డుకొని లాగేందుకు యత్నించగా ఆమె పెనుగులాడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. దీంతో అదే వ్యక్తి కారు నుంచి దిగి బలవంతంగా కారులోకి నెట్టినట్లు వివరించారు. ఐతే బాలిక తల్లి వెంకటలక్ష్మే కిడ్నాప్ చేయించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాలిక, తాతయ్య నాయనమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాలికను ఎక్కించుకున్న కారు వెళ్లిన రోడ్డులోని సీసీ కెమెరాల ఫుటేజ్ సేకరించారు. కిడ్నాప్ పై తండ్రి రవితేజకు సమాచారమందించారు.

    ఈ కిడ్నాప్ కచ్చితంగా తమ కోడలే చేయించిందని సంయుక్త తాతయ్య ఆరోపించారు. ఐదేళ్లుగా తమ కొడుకు-కోడలు విడివిడిగా ఉంటున్నారని తెలిపారు. కుమార్తె కోసం ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించిందని తెలిపారు. సంయుక్తకు తల్లితో ఉండటం ఇష్టం లేక తండ్రివద్దే ఉంటోందని తెలిపారు. సంయుక్త తల్లికి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని.. ఈ కారణంగానే భర్తతో విడిపోయినట్లు ఆరోపించారు. దీంతో పోలీసులు సంయుక్త, ఆమె బంధువుల కోసం గాలిస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published: