Adilabad : మైనర్‌ బాలికను కిడ్నాప్ చేసిన యువకులు.. గంటల్లోనే పోలీసుల చెక్...

ప్రతీకాత్మక చిత్రం

Adilabad : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ మైనర్ బాలికను అపహరించేందుకు చేసిన ప్రయత్నం తీవ్ర కలకలం రేపింది. అయితే మూడు గంటల్లోపే పోలీసులు ఆ బాలికను కిడ్నాపర్ల చెరనుంచి సురక్షితంగా విడిపించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

  • Share this:
    అదిలాబాద్‌లో బాలిక కిడ్నాప్ తీవ్ర కలకలం రేపింది.. దుండగులు బాలికను కిడ్నాప్ చేసేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. కాని పోలీసులు వెంటనే అలర్ట్ కావడంతో ఆ బాలికను కిడ్నాప్ చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

    వివరాల్లోకి వెళితే... మావల మండలం కస్తాల రామకిష్టు కాలనీకి చెందిన మైనర్ బాలిక కాలనీ శివారు ప్రాంతంలో బహిర్భూమికి వెళ్లింది...అయితే ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తమయ్యారు. వారు నేరుగా జిల్లా ఎస్పీకి ఫోన్ చేశారు. తమ కూతురు కిడ్నాప్‌కు గురైనట్టు వివరించారు. దీంతో ఎస్పీ స్థానిక పోలీసుల తోపాటు సీసీటీవి ఫుటేజిని పరిశీలించేందుకు బృందాలను ఏర్పాటు చేశారు. గాలింపు చర్యల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.ఈ నేపథ్యంలోనే బాలికతోపాటు నిందితులు స్థానిక రిమ్స్ ఆసుపత్రి వద్ద ఉన్నట్టు పసిగట్టారు. దీంతో స్థానిక సీఐ తన బృందాలతో నిందితులను అరెస్ట్ చేశారు.

    కాగా బాలిక కిడ్నాప్ కోసం నిందితులు పక్కా స్కెచ్ వేసినట్టు పోలీసులు తెలిపారు.ఇద్దరు నిందితులు ఉదయమే కేఆర్‌కే కాలనీలో శివారు ప్రాంతంలో ఓ ఆటోలో మాటువేశారని, బాలిక బయటకు రాగానే కిడ్నాప్ చేశారని చెబుతున్నారు. అయితే ఆ బాలిక కేకలు వేయడంతో పాటు విడిపించుకునే ప్రయత్నం చేసిందని, దీంతో ఆమె అరుపులు విన్న తల్లిదండ్రులు బయటకు వచ్చే లోపు నిందితులు ఆ బాలికను తీసుకుని అక్కడి నుండి పారిపోయారని వివరించారు. దీంతో తల్లిదండ్రులు తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిడ్నాప్‌ను చేధించగల్గామని చెప్పారు.

    కాగా బాలికను కిడ్నాప్ చేసేందుకు ఇద్దరు యువకులతోపాటు మరో మైనర్ బాలుడు కూడా పాలుపంచుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఆ ముగ్గురిని అరెస్ట్ చేసి వారు ఉపయోగించిన ఆటోను సీజ్ చేసినట్టు చెప్పారు.
    Published by:yveerash yveerash
    First published: