Home /News /crime /

MINOR GIRL HEAD SHAVED FACE BLACKENED PARADED IN THE VILLAGE FOR ALLEGED RELATION 22 ARRESTED IN PATAN IN GUJARAT MKS

తక్కువ కులస్తుడితో ప్రేమ.. బాలికకు గుండు గీయించి.. వెంటనే కులస్తుడితో పెళ్లి..చివరికి షాక్

బాధిత బాలిక

బాధిత బాలిక

కులస్తులు అందరి సమక్షంలో, బాలిక తండ్రి ఆదేశాల మేరకు ఆమెకు పరువు శిక్షలు విధించారు. బాలక చేతులు, కాళ్లూ కట్టేసి, గుండు గీయించి, ముఖమంతా మసిరాసి, ఆ కులం వారు నివసించే వీధులన్నీ తిప్పారు. ఆ వెంటనే తమ కులానికే చెందిన యువకుడికిచ్చి ఆ బాలికకు పెళ్లి చేశారు..

ఇంకా చదవండి ...
కులం తక్కువ వాడిని ప్రేమించడమే కాకుండా, ఆ యువకుడితో పారిపోయిన ఓ మైనర్ బాలికను ఆమె కులస్తులు అతి దారుణంగా హింసించారు.. గుండు గీసి, ముఖానికి మసి పూసి, ఊరంతా ఊరేగించారు.. అప్పటికప్పుడే తమ కులానికి చెందిన మరో యువకుడితో ఆమెకు పెళ్లి చేశారు.. బాలికపై దాడి వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.. బాలిక తండ్రితోపాటు మొత్తం 35 మందిపై కేసు నమోదు చేసి, 22మందిని అరెస్టు చేశారు. మరోవైపు, మైనర్ బాలికను లేవదీసుకెళ్లిన యువకుడికి కూడా గుండు గీయించిన ఊరేగించిన అమ్మాయి కుటుంబీకులు.. అతనిపై రేప్ కేసు పెట్టారు. అన్ని రంగాల్లో ముందంజలో ఉందనే పేరున్న గుజరాత్ రాష్ట్రంలో ఈ సంఘటన కలకలం రేపుతున్నది. వివరాలివి..

గుజరాత్ లో పటాన్ జిల్లా పరిధిలోని గ్రామంలో 14 ఏళ్ల మైనర్ బాలికపై పైశాచిక దాడి జరిగింది. అదే గ్రామానికి చెందిన 18 ఏళ్ల కుర్రాడిని ప్రేమించాననే భ్రమలో ఆ అమ్మాయి అతనితో వెళ్లిపోయింది. దీపావళి పండుగ తర్వాతిరోజే వీళ్లిద్దరూ పరారయ్యారు. తమ కూతురు తక్కువ కులం వాడిని ప్రేమించడం, అతనితో లేచిపోవడాన్ని ఆమె కుటుంబీకులు తట్టుకోలేకపోయారు. కులస్తులంతా ఏకమై, బృందాలుగా విడిపోయి పారిపోయిన జంట కోసం గాలింపు చేపట్టారు. గ్రామానికి దూరం, ఓ టౌన్ బస్టాండ్ లో జంటను దొరకబుచ్చుకున్న కులస్తులు.. వాళ్లిద్దరినీ తన్నుకుంటూ గ్రామానికి తీసుకొచ్చారు.

కులస్తులు అందరి సమక్షంలో, బాలిక తండ్రి ఆదేశాల మేరకు ఆమెకు పరువు శిక్షలు విధించారు. బాలక చేతులు, కాళ్లూ కట్టేసి, గుండు గీయించి, ముఖమంతా మసిరాసి, ఆ కులం వారు నివసించే వీధులన్నీ తిప్పారు. ఆ వెంటనే తమ కులానికే చెందిన యువకుడికిచ్చి ఆ బాలికకు పెళ్లి చేశారు. బాలికను లేవదీసుకెళ్లిన 18ఏళ్ల యువకుడికి సైతం గుండు కొట్టించి, ముఖానికి నల్లరంగు పూసి, ఊరంతా ఊరేగించారు. బాలికపై అకృత్యం తాలూకు వీడియో జిల్లా అంతటా వైరల్ కావడంతో పటాన్ పోలీసులు, బాలల సంరక్షణ విభాగం అధికారులు రంగంలోకి దిగారు.

భారీ ఎత్తున పోలీసు బలగాలతో గ్రామానికి వెళ్లిన బాలల హక్కుల అధికారులు.. బాధిత బాలిక స్టేట్మెంట్ తీసుకున్నారు. వారి సూచనల మేరకు పోలీసులు... బాలిక తండ్రితోపాటు మొత్తం 35 మందిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. అప్పటికప్పుడు దొరికిన 22 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటన తర్వాత బాలిక కుటుంబీకులు సైతం ఆమె ప్రేమికుడైన యువకుడిపై రేప్ కేసు పెట్టారు. ఈ రెండు కేసులపై దర్యాప్తు కొనసాగుతుందని పటాన్ జిల్లా పోలీసులు చెప్పారు
Published by:Madhu Kota
First published:

Tags: Gujarat, Minor girl, Police, Posco case

తదుపరి వార్తలు