సినీ నటి భానుప్రియకు షాక్... ఏక్షణమైనా అరెస్ట్ ?

భానుప్రియ వాదనను తోసిపుచ్చిన బాలల హక్కుల సంఘం... బాధిత యువతికి తగిన న్యాయం జరగాలని అంటోంది.

news18-telugu
Updated: September 21, 2019, 10:30 AM IST
సినీ నటి భానుప్రియకు షాక్... ఏక్షణమైనా అరెస్ట్ ?
భానుప్రియ (File)
news18-telugu
Updated: September 21, 2019, 10:30 AM IST
సినీ నటి భానుప్రియ ఏ క్షణమైన అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చెన్నైలో ఉంటున్న భానుప్రియ తన ఇంటి పనికోసం బాలికను నియమించుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో భానుప్రియపై చెన్నైలో కేసు నమోదైంది. చెన్నైలోని ఓ ఫ్లాట్‌లో నివసిస్తున్న ఆమె తన ఇంట్లో పనికోసం ఏపీలోని సామర్లకోటకు చెందిన బాలికను నియమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఈ విషయమై సామర్లకోట పోలీసులు భానుప్రియపై కేసు నమోదు చేశారు. ఇప్పుడా కేసు కాస్త చెన్నై పోలీసులకు బదిలీ అయింది. దీంతో చెన్నై పోలీసులు భానుప్రియ, ఆమె సోదరుడిపై మరోమారు బాలకార్మిక చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో వారిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం.

ఈ ఏడాది జనవరి 19న చెన్నైలోని పాండిబజార్ పోలీసులకు నటి భానుప్రియ, ఆమె సోదరుడు గోపాలకృష్ణన్ ఫిర్యాదు చేశారు. 16 ఏళ్ల ఆ అమ్మాయి తన ఇంట్లో దొంగతనానికి పాల్పడిందని, తాము అడగడంతో దొంగిలించిన కొన్ని వస్తువుల్ని తిరిగి ఇచ్చిందని అన్నారు. ఇంకా విలువైన వస్తువులు ఇవ్వలేదని ఆమె చెప్పారు. తాను పోలీసులకు కంప్లైంట్ ఇవ్వబోతే... అమ్మాయి తల్లి ప్రభావతి ఏడ్చిందన్న భానుప్రియ... అందుకే తాను కేసు పెట్టలేదని అన్నారు. పోలీసులు, పిల్లల సంరక్షణ విభాగం వాళ్లు ఆ యువతిని తీసుకెళ్లారని భానుప్రియ వివరించారు. అందువల్ల ఈ కేసు అక్కడితో క్లోజ్ అయ్యిందని అంతా భావించారు.

అప్పట్లో బాలల హక్కుల సంఘం ఏపీ డీజీపీని కలవడంతో మళ్లీ కేసు మొదటికి వచ్చింది. ఇప్పుడు భానుప్రియను పోలీసులు అరెస్టు చేస్తారా, చెయ్యరా అన్నది చర్చనీయాంశం అయ్యింది. భానుప్రియ వాదనను తోసిపుచ్చిన బాలల హక్కుల సంఘం... బాధిత యువతికి తగిన న్యాయం జరగాలని అంటోంది. భానుప్రియను అరెస్టు చెయ్యడం ద్వారానే న్యాయం జరిగినట్లు అవుతుందని పట్టుపడుతోంది.

 

First published: September 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...