సంగారెడ్డిలో దారుణం.. కన్నబిడ్డపై తల్లిదండ్రుల కర్కశం..

పెళ్లిని ఆపాలని బాలిక ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ టీమ్‌ను కూడా ఆశ్రయించింది. అధికారులు వచ్చి ఆమె తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి వెళ్లారు.అయినా ఆమె తల్లిదండ్రుల్లో మార్పు రాలేదు.

news18-telugu
Updated: July 15, 2019, 8:08 AM IST
సంగారెడ్డిలో దారుణం.. కన్నబిడ్డపై తల్లిదండ్రుల కర్కశం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భేటీ బచావో.. భేటీ పడావో.. వంటి పథకాలతో ఆడపిల్లల రక్షణ,చదువుపై కేంద్రప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నా సరే.. వాస్తవ పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. ఆడపిల్లలంటే భారంగా భావిస్తున్న పరిస్థితి.. ఆడపిల్లలకు చదువెందుకు అన్న ధోరణి మారడం లేదు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ బాలికకు ఇలాంటి దుస్థితే ఎదురైంది.కన్న తల్లిదండ్రులే ఆ బాలిక పట్ల దారుణంగా వ్యవహరించారు. చదువుకుంటానని ఎంత వేడుకున్నా సరే.. బలవంతంగా నిశ్చితార్థం జరిపించారు. అక్కడితో ఆగక.. పెళ్లికి ముందే కాపురం చేయించి ఆమె గర్భం దాల్చడానికి కారణమయ్యారు. బాధితురాలు ఇటీవల అధికారులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ బాలిక (16) ఇటీవల పదో తరగతి పూర్తి చేసుకుంది. ఆడపిల్లకు పెద్ద చదువులు ఎందుకని ఆలోచించిన ఆమె తల్లిదండ్రులు.. చదువు మాన్పించేశారు. అక్కడితో ఆగక... పెళ్లి చేసి ఇంటి నుంచి పంపించేయాలనుకున్నారు. పెళ్లిని ఆపాలని బాలిక ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ టీమ్‌ను కూడా ఆశ్రయించింది. అధికారులు వచ్చి ఆమె తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి వెళ్లారు.అయినా ఆమె తల్లిదండ్రుల్లో మార్పు రాలేదు. ఆ తర్వాత కొద్దిరోజులకే.. ఓ అబ్బాయితో ఆమె నిశ్చితార్థం జరిపించారు. అంతేనా.. పెళ్లి కాకముందే బాలికను అతనితో బలవంతంగా కాపురం చేయించారు.

ఎలాగోలా అతని బారి నుంచి తప్పించుకుని జూన్‌లో ఇంటి నుంచి పారిపోయి బయటకొచ్చేసింది. అధికారులను ఆశ్రయించడంతో ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని జువైనల్ హోమ్‌కు తరలించారు.అనారోగ్యంతో ఉండటంతో వైద్య పరీక్షలు చేయించగా..ఆమె గర్భవతి అని తేలింది. దీంతో సంగారెడ్డి డీఎస్పీ అనుమతి తీసుకుని అబార్షన్ చేయించారు. బాలిక తల్లిదండ్రులు, ఆమెను వివాహం చేసుకున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.First published: July 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>