Home /News /crime /

MINOR GIRL GANG RAPED IN RANCHI THREE ARRETED PVN

Gang Rape : చిన్న పిల్లల్ని కూడా వదలని కామాంధులు..బాలికపై గ్యాంగ్ రేప్..ముగ్గురు అరెస్ట్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Gang Rape  On Minor : ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా..పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా చిన్నారులపై అత్యాచారాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూల చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు.

ఇంకా చదవండి ...
Gang Rape  On Minor : ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా..పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా చిన్నారులపై అత్యాచారాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూల చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు. పది రోజుల పాప దగ్గర నుంచి పండు ముసలి దాకా ఆడదైతే చాలు అన్నట్లుగా కామాంధులు వ్యవహరిస్తున్నారు. తాజాగా 8వ తరగతి చదువుతున్న బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి( Gang Rape On Girl)పాల్పడ్డారు. 8వ తరగతి చదువుతున్న బాలికకు ఫోన్ చేసి.. ఏకాంత ప్రదేశానికి రమ్మని పిలిచి అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు మృగాళ్లు. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఈ దారుణం జరిగింది. చాహ్నో పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అత్యాచారం జరిగిందని సమాచారం అందిన గంటల్లోనే వీరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితులు ముగ్గూరూ బాలిక ఉంటున్న గ్రామానికి చెందినవారేనని తెలిపారు. కేసు దర్యాప్తులో ఉన్నట్లు చెప్పారు.

మరోవైపు, ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన మరో ఘటనలో కన్నతండ్రే తన పిల్లలను బావిలోకి విసిరేసి చంపేశాడు. ఆదివారం మధ్యాహ్నం జౌన్​పుర్ జిల్లాలోని నైపురా గ్రామంలో ఓ తండ్రి అత్యంత క్రూరంగా ప్రవర్తించి తన ఇద్దరు బిడ్డలను బావిలోకి విసిరేశాడు. దీంతో వారు చనిపోయారు. చనిపోయిన ఇద్దరిలో ఒకరు ఏడేళ్ల పాప కాగా, మరొకరు ఐదేళ్ల బాలుడు. తండ్రి మానసిక స్థితి సరిగ్గా లేదని అందుకే ఈ దారుణ చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రమే అతడ్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

ALSO READ TV Actor Arrest :పెళ్లి చేసుకుంటానని యువతితో శారీరక సంబంధం..ప్రముఖ టీవీ నటుడు అరెస్ట్

మరో ఘటనలో..ఉత్తరప్రదేశ్ లోని బాగ్ పట్ లో14 ఏళ్ల యువతి ఆదివారం చర్చిలో ప్రార్థనలు చేయడానికి సైకిల్ మీద వెళ్లింది. అయితే చాలా రోజుల నుంచి బాలికపై కన్నేసిన చర్చి పాధర్ ప్రార్థనలు అయిపోయాక.. ఆశీర్వదించాలనే పేరుతో బాలికను ఆగమన్నాడు. ఆ తర్వాత ఓ గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ బాలికని బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత.. ఎవరికైన చెబితే దారుణ పరిణామాలు ఉంటాయని బాలికను బెదిరించాడు. భయపడిపోయిన బాలిక.. ఇంటికి చేరుకుంది. బాలిక భయంతో ఉండటంతో ఇంటిలో వారు నిలదీశారు. అప్పుడు ఆమె జరిగిన దారుణాన్ని చెప్పింది. వెంటనే వారు స్థానిక పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదుచేశారు. బాలికను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు. ఘటనపై విచారణ చేపట్టారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Gang rape, Jharkhand, Minor girl raped, Minor rape, Uttar pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు