తెలంగాణలో బాలికపై గ్యాంగ్ రేప్... ఊరిపెద్దలు ఏం చేశారంటే...

ప్రతీకాత్మక చిత్రం

బాలిక బహిర్భూమికని బయటకు వెళ్లిన సమయంలో అక్కడే కాపు కాసిన ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు.

 • Share this:
  తెలంగాణలో బాలికపై గ్యాంగ్ రేప్... ఊరిపెద్దలు ఏం చేశారంటే...

  దిశ హత్యాచార ఘటనలో నిందితుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన.. జనాల్లో మాత్రం మార్పు రావడం లేదు. దిశ ఘటన తర్వాత అమ్మాయిలపై వరుసగా అఘాయిత్యాలు, గ్యాంగ్ రేప్‌లు జరుగుతూనే ఉన్నాయి. మైనర్ బాలికలపై కూడా కామాంధులు తన పైశాచికత్వం చూపిస్తూనే ఉన్నారు. తాజాగా తెలంగాణలో చోటు చేసుకున్న మరో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే .. బహిర్భూమికి వెళ్లిన బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన నల్గొండ జిల్లా మాడ్గులమల్లి మండలం గుండ్రవానిగూడెంలో చోటు చేసుకుంది. అయితే గ్రామ పెద్దలు ఈ విషయాన్ని అక్కడికక్కడే సెటిల్ చేసేయడంతో విషయం బయటకు రావడంలో ఆలస్యం జరిగింది.

  బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ బాలిక తన తల్లిదండ్రులతో కలిసి గ్రామంలో నివాసం ఉంటుంది. అయితే బాలిక బహిర్భూమికని బయటకు వెళ్లిన సమయంలో అక్కడే కాపు కాసిన ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితురాలు విషయం కుటుంబసభ్యులకు చెప్పడంతో.. వారు గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామ పెద్దలు ఈ వ్యవహారాన్ని బయటకు పొక్కనివ్వకుండా బాధితురాలు కుటుంబానికి కొంత మొత్తాన్ని ముట్టచెప్పి... గుట్టుచప్పుడు కాకుండా బాలికను సొంత రాష్ట్రానికి పంపించేశారు. ఆ నోట ఈ నోట ఈ విషయం బయటకు రావడంతో ఇప్పుడు పోలీసుల వరకు వెళ్లింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఊరి ప్రజలతో పాటు, గ్రామస్థుల్ని విచారిస్తున్నారు.
  Published by:Sulthana Begum Shaik
  First published: